Begin typing your search above and press return to search.
పెళ్లిచూపులు.. సురేష్ బాబుకు నచ్చలేదు!
By: Tupaki Desk | 28 July 2016 7:30 PM GMT‘పెళ్లిచూపులు’ నచ్చకపోతే సురేష్ బాబు ఈ సినిమాలో ఎందుకు భాగస్వామి అయ్యారు.. ఇంతగా ఎందుకు ప్రమోట్ చేశారు.. విడుదలకు ముందే ఈ సినిమాకు అంత పాజిటివ్ టాక్ ఎలా వచ్చింది.. అంటారా? ఐతే నచ్చకపోవడం అంటే సినిమా తీశాక కాదు.. స్టోరీ చెబుతున్నపుడు. డెబ్యూ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముందు ‘పెళ్లి చూపులు’ కథ సురేష్ బాబుకే చెప్పారట. ఐతే ఆయనకు ప్రథమార్ధం మాత్రమే బాగా అనిపించిందట. ద్వితీయార్ధం నచ్చలేదట. ‘‘అవును.. పెళ్లిచూపులు కథ ముందు సురేష్ గారికే చెప్పాను. ఆయనకు సెకండాఫ్ నచ్చలేదు. మార్చమన్నారు. ఆయన చెప్పినట్లే దాని మీద వర్కవుట్ చేసి తీసుకెళ్లాను. తర్వాత బాగుందన్నారు. ఆపై ఆయనే రాజ్ కందుకూరికి నన్ను పరిచయం చేశారు. ఆయనకు నచ్చి సినిమా ప్రొడ్యూస్ చేశారు’’ అని తరుణ్ చెప్పాడు.
‘పెళ్లిచూపులు’ సినిమాను విడుదలకు ముందే చాలామందికి చూపించడం వల్ల చాలా మంచి జరిగిందని.. ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చిందని.. సామాన్య ప్రేక్షకులకు సినిమా గురించి తెలిసిందని.. ఇలా ప్రివ్యూలు వెయ్యాలన్న ఆలోచన సురేష్ బాబుదే అని తరుణ్ చెప్పాడు. ముందు ఈ సినమాకు అనుకున్న టైటిల్ ‘పెళ్లి చూపులు’ కాదని తరుణ్ వెల్లడించాడు. ‘‘ముందు ఈ సినిమాకి ‘అనుకోకుండా’ అనే టైటిల్ అనుకున్నాను. కానీ అప్పటికే అది రిజిస్టర్ అయిపోయింది. తరువాత వివాహ భోజనంబు.. పెళ్లి చూపులు అని రెండు టైటిల్స్ అనుకున్నాం. సినిమా మొదలయ్యేది.. పూర్తయ్యేది పెళ్లి చూపులతోనే కాబట్టి అదే ‘పెళ్లిచూపులు’ అయితేనే బాగుంటుందని అదే ఫైనలైజ్ చేశాం’’ అన్నాడు.