Begin typing your search above and press return to search.
రానా పెళ్లిపై నాన్న ఏమన్నారంటే..
By: Tupaki Desk | 23 July 2016 12:50 PM GMTఓ చిన్న సినిమాతో పెద్ద ప్రొడ్యూసర్ అసోసియేట్ కావడం.. అరుదుగా జరిగే విషయం. ఇప్పుడు పెళ్లిచూపులు విషయంలో భారీ చిత్రాల నిర్మాత సురేష్ బాబు అసోసియేట్ కావడంతో ఆ మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చిన్న సినిమా అయినా.. స్టోరీ బోర్డ్ - బౌండ్ స్క్రిప్ట్ - సింక్ సౌండ్ ఇలా పర్ఫెక్ట్ గా తీసిన విధానం నచ్చిందని అంటున్నారు నిర్మాత సురేష్ బాబు.
మరి సినిమా పేరు పెళ్లి చూపులు కాబట్టి.. తన పెళ్లి చూపులపై కూడా ఆన్సర్ ఇచ్చారు ఈ బడా ప్రొడ్యూసర్. 'అప్పట్లో పెల్లి చూపులంటే తెగ సిగ్గుగా ఉండేది. మా ఫ్రెండ్ వాళ్లింటికి రమ్మన్నాను. వరుసగా మూడు రోజులు పిలిచినా తను వచ్చింది. ఈ మూడ్రోజుల్లో ఒక్క మాట మాట్లాడకపోయినా పెళ్లి చేసుకుంటానని చెప్పా' అన్నారు సురేష్ బాబు. అదే సమయంలో తన కొడుకు రానా పెళ్లిపై కూడా కామెంట్ చేశారీయన. తనను చేయమంటాడో.. తనే చేసేసుకుంటాడో తెలీదంటూ సురేష్ బాబు వేసిన జోక్ బాగానే పేలింది.
ఇక పెళ్లి చూపులు స్టోరీ విషయానికొస్తే.. ఓ బద్ధకస్తుడికి.. నిబద్ధతతో ఉండే అమ్మాయికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే.. ఒకే రూమ్ లో గడపాల్సి వస్తే అనే పాయింట్ పై సాగుతుందంటూ.. సినిమా గురించిన వివరాలు చెప్పారు సురేష్ బాబు.