Begin typing your search above and press return to search.
సురేష్ బాబు మరో ఓటీటీ రిలీజ్ కు ప్లాన్
By: Tupaki Desk | 19 Jan 2022 4:43 AM GMTఈమద్య కాలంలో చిన్న సినిమాలకు మరియు మీడియం బడ్జెట్ సినిమాలకు థియేటర్ రిలీజ్ కంటే ఓటీటీ రిలీజ్ లాభదాయకం అన్నట్లుగా మారింది అంటూ నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ సినిమాలు థియేటర్ రిలీజ్ అయితే జనాలు భారీగా చూడటం జరుగుతుంది కనుక భారీ మొత్తంలో వసూళ్లు నమోదు అవుతాయి. కాని చిన్న సినిమాలకు మరియు మీడియం రేంజ్ సినిమాలు థియేటర్ రిలీజ్ అయితే వస్తున్న వసూళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. సినిమా సూపర్ హిట్ అయితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కావడం లేదు. కాని ఓటీటీ ద్వారా సినిమా ను విడుదల చేయడం ద్వారా నిర్మాత ముందుగానే సేఫ్ అవుతున్నాడు. అందుకే సురేష్ బాబు వంటి పెద్ద నిర్మాతలు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఏపీలో ఉన్న టికెట్ల రేట్లు మరియు కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్ లలో సినిమాలు విడుదల చేస్తున్నా కూడా జనాలు రాకపోవడం వంటి కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ లు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరిస్థితులు ఇలాగే కొనసాగితే థియేటర్ల ద్వారా సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని పేర్కొన్నాడు.. తమ సినిమాలను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఓటీటీ లో సినిమాలను స్ట్రీమింగ్ చేయడం ద్వారా సురేష్ బాబు ఇప్పటికే మంచి లాభాలను దక్కించుకున్నాడు. ఆయన నిర్మాణంలో రూపొందిన సినిమాలు మరియు ఆయన ఇతర నిర్మాతలతో కలిసి నిర్మించిన పలు సినిమాలను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయడం జరిగింది. ముందు ముందు మరిన్ని సినిమాలను కూడా స్ట్రీమింగ్ చేసేందుకు ఆయన సిద్దం అవుతున్నాడు.
గురు ఫిల్మ్స్ బ్యానర్ తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు నిర్మించిన చిత్రం 'శాకిని డాకిని' ని ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక విదేశీ సినిమాకు రీమేక్ అనే వార్తలు మొదటి నుండి వస్తున్నాయి. రెజీనా మరియు నివేదా థామస్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా గత ఏడాది కాలంగా వార్తల్లో నానుతూ వస్తుంది. దాంతో మీడియా సర్కిల్స్ మరియు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు ఆసక్తి పెరిగింది. సినిమా ను థియేటర్ రిలీజ్ చేయాలని భావించినా కూడా పరిస్థితులు అనుకూలించడం లేదని.. కరోనా థర్డ్ వేవ్ వల్ల చిన్న సినిమాలకు మళ్లీ ఎప్పటికి విడుదలకు అవకాశం దక్కుతుంది అనేది తెలియడం లేదు. అందుకే శాకిని డాకిని సినిమా ను ఓటీటీ రిలీజ్ చేసేందుకు గాను నిర్మాతలు చర్చలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వస్తుందేమో చూడాలి.