Begin typing your search above and press return to search.
ఎందరో 'డ్రగ్స్'భావులు
By: Tupaki Desk | 2 July 2018 7:33 AM GMTపైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వాడకం ఉందన్నది నిజం. ఆ మధ్య ఏదో కేసు విచారణ అంటూ హడావిడి చేసి సైలెంట్ అయ్యారు కానీ నివురు గప్పిన నిప్పుగా చాలా విషయాలు ఫైల్ కింద ఉండిపోయాయన్నది పైకి కనిపించని వాస్తవం. హీరోలు సైతం డ్రగ్స్ కి అలవాటు పడి ఏ స్థాయి పతనాన్ని కొనితెచ్చుకుంటారో మొన్న శుక్రవారం విడుదలైన సంజు సినిమాలో రాజ్ కుమార్ హిరాణి నేరుగా చూపించాడు. తాజాగా సురేష్ బాబు కూడా దీని గురించి ఓపెన్ అయిపోయారు. పరిశ్రమలో డ్రగ్స్ వాడుతున్న వారిలో హీరోలు-సంగీత దర్శకులు-రచయితలు ఉన్నారని తేల్చేశారు.
వాళ్ళ క్రియేటివిటీ డ్రగ్స్ వాడినప్పుడే బయటికి వస్తున్న తరుణంలో ఇది తప్పు అని చెప్పే అవకాశం లేకుండా పోతోందని చెప్పారు. కథను రాసివ్వడానికి ట్యూన్స్ కట్టడానికి సైతం డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారని నియంత్రించడం కానీ పని అని క్లారిటీ ఇచ్చేసారు. డ్రగ్స్ వాడే వాళ్ళను నిషేధించడం మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదని చెప్పిన సురేష్ బాబు ఒకవేళ అలాంటిది ఏదైనా చేస్తే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు బలవుతారు తప్ప పలుకుబడి ఉన్న బిగ్ షాట్స్ తప్పించుకోవడం ఖాయమంటూ కుండబద్దలు కొట్టారు. డ్రగ్స్ విషయంలో ఒకే మాట మీద నిలబడే గ్రూప్స్ ఉన్నాయని సురేష్ బాబు చెప్పడం చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్థమవుతోంది. డ్రగ్స్ కానీ సెక్స్ కానీ వ్యక్తిగతంగా చూడకుండా పరిశ్రమకు ఆపాదించడం వల్లే సమస్య వస్తోందని ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని కోరారు.
టాలీవుడ్ ని ఈ మధ్య బాగా చికాకు పెట్టిన విషయాల గురించి సురేష్ బాబు చాలా రోజుల నుంచి మౌనంగా ఉన్నారు. ఇప్పుడిలా ఓపెన్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇదంతా ఓకే కానీ డ్రగ్స్ తీసుకోనిదే కథ రాయలేని పాట కట్టలేని ఆ డ్రగ్స్ భావులు ఎవరా అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది.