Begin typing your search above and press return to search.
పిచ్చ లైట్ అంటున్న 'ఆ నలుగురు'
By: Tupaki Desk | 24 July 2016 5:34 AM GMT'ఆ నలుగురు' ఒక మంచి సినిమా. అది పక్కనుంచితే.. ఆ నలుగురు.. అంటూ చాలామంది చిన్న సినిమాల ప్రొడ్యూసర్లు, చిన్న చిన్న డిస్ర్టిబ్యూటర్లు తెగ వాడేస్తుంటారు. ఓపెన్ గా చెప్పాలంటే.. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు.. మరియు ఇంకొందరు పెద్దాళ్ళను కలిపి.. 'ఆ నలుగురు' అంటూ అందరూ కామెంట్లు చేస్తుంటారు. మరి అలాంటివి విన్నప్పుడు ఆ నలుగురికీ ఏమని అనిపిస్తుంది?
ఇదే విషయంపై నిన్న ప్రొడ్యూసర్ సురేష్ బాబును అడిగితే.. అసలు అలా అనేవారి గురించి ఆలోచించడం మానేశాను అంటున్నారు. ''అలా అనేవాళ్లు ఎవరు? వాళ్లవల్ల సినిమా పరిశ్రమకు ఏం ఉపయోగం జరుగుతుంది? ప్రారంభంలో అలా అంటే నాకు బాధగానే ఉండేది. కానీ వాళ్ల గురించి ఆలోచించడం మానేశా. నేనేం ఇల్లీగల్ పనులు చేయడం లేదు కదా'' అంటూ సెలవిచ్చారు సురేష్ బాబు. నిజంగానే ఈయన యాంగిల్లో చూసుకుంటే.. 'ఆ నలుగురు' అంటూ కామెంట్లు చేసేవారు మూడు సంవత్సరాలకు ఒక సినిమాను తీయడం తప్పించి.. ఒక అరవింద్ లా ఒక దిల్ రాజులా సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలను మాత్రం తీయట్లేదు. అందుకే వీళ్ళు ఆ విమర్శకుల గురించి పిచ్చలైట్ అనేస్తున్నారు.
ఇకపోతే 'ఆ నలుగురు' చాలా విషయాల్లో స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎన్నో రూమర్లు వస్తున్నా కూడా.. ఈ నలుగురు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారంతే. అది సంగతి.