Begin typing your search above and press return to search.
అలా ‘రానా’ అయ్యాడట
By: Tupaki Desk | 19 Jun 2016 11:30 AM GMTరానా పూర్తి పేరేంటి? అని రానా గురించి మాట్లాడే వారిని అడగండి.. ‘‘రానా దగ్గుబాటి’’ అని సమాధానం వస్తుంది. ‘రానా’ అసలు పేరు అదేనా? అంటే అవుననే సమాధానం చాలామమంది నోటి నుంచి వచ్చేస్తుంది. కానీ.. రానా అసలు పేరు రామానాయుడు అన్న విషయం కొందరికి మాత్రమే తెలుసు. నిజమే.. తన తండ్రి పేరునే తన కొడుకు పేరుగా పెట్టుకున్నారు సురేశ్ బాబు. నిజానికి.. రానాకు ‘సిద్థార్థ్’’అని పేరు పెట్టాలని సురేశ్ బాబు వైఫ్.. రానా తల్లి కోరుకున్నారు.
కానీ.. బారసాల రోజున కొడుకు పేరు రాయాలని పంతులుగారు చెప్పినప్పుడు సురేశ్ బాబు తన తండ్రి పేరైన ‘రామానాయుడు’ పేరును రాసేసిన విషయాన్ని సురేశ్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘నేను ఎవరికి చెప్పలేదు. నాన్న పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యా. బియ్యం మీద రాసినప్పుడు రామానాయుడు అన్నా. నాన్న సంబరపడ్డారు. తర్వాత నాన్న ఫ్రెండ్ ఒకాయన ‘రామానాయుడు’ అని తాను పిలవలేనని.. రానా (రామా నాయుడు పదాల్లోని మొదటి అక్షరాలు కలిపి) అని పిలుస్తానని మొదలు పెట్టారు. అప్పటి నుంచి అదే కంటిన్యూ అయిపోయింది’’ అంటూ రానా పేరు వెనకున్న స్టోరీని చెప్పుకొచ్చారు. సో.. ఇప్పుడు అర్థమైందా? రానా అసలు పేరేంటో..?