Begin typing your search above and press return to search.

డ‌బ్బింగు కోసం వెంప‌ర్లాట ఏమిటో!

By:  Tupaki Desk   |   6 Nov 2019 2:51 AM GMT
డ‌బ్బింగు కోసం వెంప‌ర్లాట ఏమిటో!
X
విక్ట‌రీ వెంక‌టేష్- నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న `వెంకీ మామ‌` రిలీజ్ స‌స్పెన్స్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని తొలుత‌ జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయాల‌ని డి.సురేష్ బాబు భావించారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ ప్లాన్ ఛేంజ్ అయ్యింద‌ని తెలుస్తోంది. వెంకీమామ చిత్రం క్రిస్మ‌స్ కానుక‌గా 25న రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.

థియేట‌ర్స్ య‌జ‌మానిగా ఆయ‌న 25వ తేదీనే ఫిక్స్ చేసుకోవ‌డానికి ఓ ప్ర‌త్యేక‌ కార‌ణం ఉందని తెలుస్తోంది. ఆయ‌న త‌న బాలీవుడ్ మిత్రుడు స‌ల్మాన్ కి ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి వెంకీమామ రిలీజ్ తేదీని కాస్త అటుగా జ‌రిపార‌ట‌. స‌ల్మాన్ భాయ్ న‌టించిన భారీ చిత్రం ద‌బాంగ్ 3 అటు ఉత్త‌రాదితో పాటు సౌత్ లోనూ  భారీగా రిలీజ‌వుతోంది. డిసెంబ‌ర్ 20న ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డ్ స్థాయిలో రిలీజ‌వుతోంది. మ‌ల్టీప్లెక్సుల‌ సంగ‌తి అటుంచితే ఆ చిత్రాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే బాధ్య‌త‌ డి.సురేష్ బాబు పైనే ఉందిట‌. అందువ‌ల్ల‌నే వెంకీమామ‌ను డిసెంబ‌ర్ 20 రిలీజ్ చేయాల‌నుకున్నా ప్లాన్ ని మార్చుకుని  డిసెంబ‌ర్ 25 కి షిఫ్ట్ చేశాడ‌ట‌. వెంకీమామ‌ను వెన‌క్కి తోయ‌డానికి ద‌బాంగ్ 3 ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

ఒక అనువాద చిత్రం అయినా ద‌బాంగ్ 3 రిలీజ్ కోసం స‌ద‌రు నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ వెంప‌ర్లాడ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇదే నెల‌లో రూల‌ర్ .. డిస్కోరాజా.. ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. ఒక‌వేళ స్ట్రెయిట్ సినిమాల విష‌యంలో థియేట‌ర్ల‌ను స‌ర్థాల్సి వ‌స్తే స‌ద‌రు నిర్మాత అందుకు స‌హ‌క‌రించేవారా? అన్న‌దానిపైనా సెటైర్లు వేస్తున్నారు కొంద‌రు. అయితే క్రేజు ఉన్న సినిమాకి బిజినెస్ అయ్యే సినిమాకి ఆయ‌న స‌పోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డిమాండ్- స‌ప్ల‌య్ సూత్రాన్ని ఆయ‌న న‌మ్ముతారు.