Begin typing your search above and press return to search.

సురేష్‌ బాబు ఉన్నమాటే అన్నారు

By:  Tupaki Desk   |   23 July 2021 9:30 AM GMT
సురేష్‌ బాబు ఉన్నమాటే అన్నారు
X
కరోనా వల్ల ఇండియన్ సినీ మార్కెట్లోకి ఓటీటీ అనూహ్యంగా దూసుకు వచ్చింది. అంతకు ముందు నుండే ఓటీటీలు ఉన్నా కూడా థియేటర్‌ ల్లో విడుదల అయిన తర్వాత మాత్రమే సినిమాలు అందులో కొన్ని వారాల తర్వాత స్ట్రీమింగ్‌ అయ్యేవి. ఓటీటీలను వెబ్‌ సిరీస్ ల కోసం పాత సినిమాల కోసం గతంలో జనాలు చూసేవారు. కాని ఇప్పుడు కొత్త సినిమాలు పెద్ద ఎత్తున విడుదల అవుతున్నాయి. ఇండియన్ సినిమాలు థియేటర్ రిలీజ్ కు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. కరోనా కారణంగా గత ఏడాదిన్నర కాలంగా థియేటర్లు చాలా వరకు మూత పడే ఉన్నాయి.

కొన్ని చోట్ల తెరుచుకున్నా కూడా సెకండ్‌ వేవ్ వల్ల మళ్లీ మూసుకున్నాయి. థర్డ్‌ వేవ్‌ అంటున్నారు కనుక ఈ ఏడాది చివరి వరకు కూడా థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అవుతాయనే నమ్మకం లేదు. అందువల్ల చాలా సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గతంలో హాలీవుడ్‌ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు మాత్రమే ఓటీటీలో సందడి చేసేవి. కాని ఇప్పుడు ఇండియన్‌ సినీ మార్కెట్‌ లో ఓటీటీ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సమయంలో ఎంతో మంది నిర్మాతలకు ఓటీటీలు పెద్ద ఊరట అనడంలో సందేహం లేదు. భారీగా పెట్టుబడి పెట్టిన చిన్న నిర్మాతలు ఆర్థిక భారంతో క్రుంగి పోకుండా ఓటీటీలు ఎంతో హెల్ప్‌ గా నిలుస్తున్నాయి.

ఇదే సమయంలో థియేటర్ల యాజమాన్యాలు మరియు బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబ్యూటర్లు మాత్రం ఓటీటీ రిలీజ్ లు పెరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కొన్ని రోజులు నిర్మాతలు వెయిట్‌ చేయాలంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమయంలో ఓటీటీకి వెళ్తే ముందు ముందు కూడా జనాలు థియేటర్లకు రాకపోవచ్చు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో సురేష్‌ బాబు మాట్లాడుతూ నిర్మాతల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ చేయక తప్పదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చాలా ఓటీటీ ద్వారా విడుదల అవుతాయనే విషయాన్ని కూడా ఆయన చెప్పేశాడు. ఈ సమయంలో థియేటర్లతో పాటు ఓటీటీలు కూడా టాలీవుడ్‌ కు చాలా అవసరం అని.. చిన్న సినిమాలు ఎక్కువ రావడంతో పాటు ఎక్కువ మందికి అవకాశాలు దక్కుతాయి.

టాలీవుడ్‌లో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్ని రావాలంటే ఓటీటీలు మరియు థియేటర్లు ఉండాలంటూ సురేష్‌ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమయంలో థియేటర్ల కోసం వెయిట్‌ చేస్తూ కూర్చుంటే ఇండస్ట్రీ మనుగడ కష్టం అవుతుందని అందుకే ఓటీటీలు కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే అని.. వాటిని కాదనడం తప్పడం వల్ల తెలుగు సినిమా పరిశ్రమ మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమయంఓల ఓటీటీ లు లేకుంటే నిర్మాతలు చాలా ఇబ్బందులు పడే వారు.

సినిమా లు విడుదల తర్వాత కోట్లకు కోట్ల రూపాయలను ఇచ్చి కొనుగోలు చేస్తున్న ఓటీటీ లు నిర్మాతలకు ఎంతో లాభసాగిగా ఉన్నాయి. కనుక అలాంటి ఓటీటీలను ప్రోత్సహించాల్సిందే అని థియేటర్లకు మళ్లీ మునుపటి రోజులు వస్తాయనే నమ్మకంను సురేష్‌ బాబు వ్యక్తం చేశారు. సురేష్‌ బాబు వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నా కూడా కొందరు మాత్రం ఆయన ఉన్న మాటే అన్నారు.. ఈ సమయంలో ఓటీటీల అవసరం సినిమా ఇండస్ట్రీకి చాలా ఉంది. ఓటీటీలు లేకుంటే సినిమా ఇండస్ట్రీ పూర్తిగా స్థంభించేది అంటూ కొందరు సురేష్ బాబు వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడుతున్నారు.