Begin typing your search above and press return to search.
మెగా హీరోని ఆయనే లేపాడట!
By: Tupaki Desk | 6 May 2019 4:40 PM GMTమెగా హీరోల్లో అల్లు శిరీష్ స్థానం ఏమిటో తెలిసిందే. ఎట్టి పరిస్థితిలో అతడు తిరిగి తనని తాను ఎలివేట్ చేసుకునే పంతంతో ఉన్నాడు. అందుకు బాస్ అల్లు అరవింద్ సెలక్షన్ అండగా ఉంది కాబట్టి కొంతవరకూ ఓకే. ప్రస్తుతం తెలివైన స్క్రిప్టుల ఎంపికలతో ముందుకు వెళ్లాలని శిరీష్ డిసైడ్ అయ్యాడట. గత సినిమా `ఒక్క క్షణం` ఫ్లాపయ్యాక ఎంతో ఏరి కోరి ఎంపిక చేసుకున్న రీమేక్ మూవీ ఏబీసీడీ తన ఫేట్ మారుస్తుందని భావిస్తున్నాడట.
ఇప్పటికే ఈ సినిమా టీజర్ మెప్పించింది. శిరీష్ బాడీ లాంగ్వేజ్ కి సూటబుల్ కథనే ఎంచుకున్నాడన్న ప్రశంసలు దక్కాయి. కానీ అతడికి మార్కెట్ వర్గాల్లో మరీ అంత బజ్ లేకపోవడంతో ప్రీరిలీజ్ బిజినెస్ విషయంలో ఊపు లేనేలేదని ఇటీవల ప్రచారమైంది. ఈలోగానే ఈ సినిమాని ఎంతో తెలివిగా జీ చానెల్ కి అమ్మేశారు. శాటిలైట్- డిజిటల్ రైట్స్ రూపంలో ఊహించని రీతిలో 5కోట్లు దక్కింది. ఏ కోణంలో చూసినా ఇది శిరీష్ రేంజుకు మించి. శిరీష్ కెరీర్ హిట్ చిత్రం శ్రీరస్తు శుభమస్తు కే ఇంత శాటిలైట్ పలకలేదు.
సరిగ్గా ఈ వార్తతోనే థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ కాస్తంత కదలిక కనిపించింది. అటుపై అగ్రనిర్మాత డి.సురేష్ బాబు రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఆయన బరిలో దిగడంతో ఏబీసీడీని కొనేందుకు బయ్యర్లు వస్తున్నారట. డీల్ ఫర్వాలేదనిపించే విధంగానే సెట్ చేస్తున్నారని తెలుస్తోంది. అదంతా సరే .. కానీ ఈ సినిమాకి థియేటర్ల పరమైన చిక్కులేవీ లేవా? అంటే మహర్షి రిలీజైన తర్వాతి వారంలోనే రిలీజ్ ప్లాన్ చేయడం ఇబ్బందికరమేనని అంటున్నారు. మే 17న ఏబీసీడీ రిలీజ్ ని ఫైనల్ చేశారు కాబట్టి థియేటర్ల ఇష్యూ లేకుండా చూసుకోవాల్సి ఉంటుందట. మరో రెండు వారాల్లోనే అల్లూ వారబ్బాయ్ ఫేట్ ఎలా ఉందో తేలనుంది. హిట్టును నమ్మే పరిశ్రమలో అది దక్కించుకోకపోతే సెంటిమెంటు పరిశ్రమలో కష్టమేనని ప్రూవైంది. మరి ఈసారి ష్యూర్ షాట్ గా నిరూపించుకుంటాడా లేదా? అన్నది వేచి చూడాలి.