Begin typing your search above and press return to search.
ఆ హీరో మీద హత్య బెదిరింపు కేసు!
By: Tupaki Desk | 12 May 2017 2:28 PM GMTతమిళ సినీ రాజకీయాల్లో తరచూ నలిగే పేరు హీరో విశాల్. ఆయనపై తాజాగా ఒక ఫిర్యాదు పోలీసులకు అందింది. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన తనపై మర్డర్ వార్నింగ్ లకు పాల్పడుతున్నారంటూ నిర్మాత.. దర్శకుడు సురేశ్ కామాక్షి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో విశాల్ వర్గానికి వ్యతిరేకంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నేపథ్యంలో తనకు బెదిరింపులు వస్తున్నట్లుగా వెల్లడించారు.
హీరో విశాల్ తో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం లేదన్న ఆయన.. నడిగర్ సంఘ రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో విభేదాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇటీవల నడిగర్ సంఘ కొత్త భవన నిర్మాణంపై మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిలుపుదల ఆర్డర్ జారీ చేసిందని.. స్థలాన్ని సంఘం ఆక్రమించటమే కారణంగా చెప్పారు. సంఘం చేసిన పనుల గురించి తాను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని.. దీంతో తనపై బెదిరింపులకు దిగుతున్నారన్నారు.
తన సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చి హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పిన ఆయన.. ఇదంతా విశాల్ తన ఫ్యాన్స్ కు నెంబరు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలకు తెర తీస్తున్నారన్నారు. చెన్నైలోని వడపళని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. విశాల్ అభిమానులుగా చెప్పుకుంటున్న తమిళ నిర్మాతల సంఘం నిర్వాహకుడు రాబిన్.. విశాల్ అభిమాన సంఘ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న కమల్ కన్నన్.. మరో అభిమాని తనపై రౌడీయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. సురేశ్ కామాక్షి ఇచ్చిన ఫిర్యాదును విచారణకు స్వీకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేశారు. తాజా ఉదంతంపై విశాల్ స్పందించాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/