Begin typing your search above and press return to search.

చిరుకి నాన్న - చరణ్ కు కొడుకు

By:  Tupaki Desk   |   23 Nov 2018 1:30 AM GMT
చిరుకి నాన్న - చరణ్ కు కొడుకు
X
వినయ విధేయ రామ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ 50 డేస్ టు గో అంటూ ట్రెండింగ్ కూడా మొదలుపెట్టేసారు. అధికారికంగా డేట్ ప్రకటించకపోయినా రావడం పక్కా కాబట్టి ఓ రోజు అటు ఇటు అయినా తమ ఎగ్జైట్మెంట్ ను ఈ రకంగా చూపించేస్తున్నారు. ఇప్పటికే టీజర్ ఇదో ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ అనే ఇంప్రెషన్ ఇవ్వడంతో రంగస్థలం తర్వాత రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక సినిమాకు సంబందించిన విశేషాలు ఒక్కొక్కటిగా ఆసక్తి రేపుతున్నాయి.

ముఖ్యంగా ఇందులో విలన్ గా నటించిన వివేక్ ఒబెరాయ్ తన టెర్రిఫిక్ లుక్స్ తో ఇప్పటికే ఆకట్టుకున్నాడు. మామూలుగానే బోయపాటి శీను విలన్లు ఓ రేంజ్ లో ఉంటారు. అలాంటిది గ్లామర్ కూడా తోడైన వివేక్ లాంటి యాక్టర్ అంటే ప్రత్యేకంగా చెప్పాలా. టీజర్ లో సన్నివేశాన్ని బట్టి వివేక్ పేరు పరశురామ్ అనే అంచనాలో ఉన్నారు అభిమానులు. ఈ సందర్భంగా వివేక్ కు చిరు కు ఒక చిన్న లింక్ గురించి చెప్పుకోవాలి.

చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు మొదలైంది మరణమృదంగం సినిమా నుంచి. 1988లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో కమర్షియల్ గా పెద్ద హిట్. యండమూరి యాక్షన్ నవలకు కోదండరామి రెడ్డి దర్శకత్వం-ఇళయరాజా సంగీతం తోడై సక్సెస్ ఇచ్చాయి. అందులో విలన్ గా చేసింది సురేష్ ఒబెరాయ్. ఈయన సాక్షాత్తు వివేక్ ఒబెరాయ్ తండ్రి. ఆ తర్వాత సురేష్ ఒబెరాయ్ ఒకటి రెండు తప్ప బాలీవుడ్ కమిట్మెంట్స్ వల్ల తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. కానీ అందులో వసంత దాదాగా స్వంత డబ్బింగ్ తో సురేష్ ఒబెరాయ్ విలనీ మెగా ఫాన్స్ మర్చిపోలేరు.

సరిగ్గా 30 ఏళ్ళ తర్వాత ఆయన తనయుడు మెగా వారసుడి సినిమాలో విలన్ గా చేయడం కాకతాళీయమే అయినా ఫ్యాన్స్ కు మాత్రం సంథింగ్ స్పెషల్ అనే ఫీలింగ్ కలిగిస్తోంది. సురేష్ ఒబెరాయ్ మరణమృదంగంలో మాఫియా డాన్ గా నటిస్తే ఇందులో వివేక్ ఒబెరాయ్ ఆయుధాలతో స్మగ్లింగ్ చేసే ఇంటర్నేషనల్ క్రిమినల్ గా నటిస్తున్నట్టు టాక్ . పోలికలు మాత్రం భలే కలిసిపోతున్నాయి కదూ.