Begin typing your search above and press return to search.
సురేష్ ప్రొడక్షన్స్ వారి రాజమండ్రి రోజ్ మిల్క్ ఇదుగో..!
By: Tupaki Desk | 29 May 2022 10:30 AM GMTటాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నుండి ఇటీవల కాలంలో వరుసగా చిన్న సినిమాలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి.
తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ నుండి రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా రాబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.
నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు. ఇప్పటి వరకు ఈ చిత్రంలో నటించే నూతన హీరో, హీరోయిన్స్ ప్రచార చిత్రాలను గోప్యంగా వుంచిన చిత్రం బృందం నేడు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ఈ చిత్రం హీరో, హీరోయిన్ లను రివీల్ చేసింది.
ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ రోజు సాయంత్రం తన సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. దర్శకుడు నాని చిత్ర విశేషాలను తెలియజేస్తూ పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికి కాలేజీ రోజులను గుర్తు చేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ జూన్ 10 నుంచి రెండవ షెడ్యూల్‌ను రాజమ్రండి, వైజాగ్‌లో చిత్రీకరిస్తాం. సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.
ఈమద్య కాలంలో చిన్న సినిమాలకు.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆధరణ లభిస్తుంది. టైటిల్ తోనే ఆకట్టుకున్న రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్ సినిమా కూడా తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.