Begin typing your search above and press return to search.
సురేష్ ప్రొడక్షన్స్ లో అరడజను!
By: Tupaki Desk | 26 April 2019 4:16 PM GMTచిన్న సినిమాల్లో కంటెంట్ ఉన్న సినిమాలకు అగ్ర నిర్మాతల అండా దండా గురించి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ఇలాంటి ఎన్నో సినిమాలకు తనవంతు సాయం అందించడం ప్రస్తుతం హాట్ టాపిక్. దర్శకరచయితల్లో పనితనం ఉన్నవారిని.. అభిరుచి ఉన్నవారిలో తమను సంప్రదించే వారి సినిమాల రిలీజ్ లకు ఎలాంటి ఆటంకం లేకుండా సాయం అందించడం.. ప్రచార పరంగా బూస్ట్ ఇవ్వడం ఆయన పని. అవసరం మేర పెట్టుబడుల సాయం అందిస్తూ నిర్మాణ భాగస్వామిగానూ కొనసాగుతున్నారు.
అలా గత ఏడాది వెంకటేష్ మహా అనే కొత్త కుర్రాడు తెరకెక్కించిన `కేరాఫ్ కంచరపాలెం` చిత్రానికి డి.సురేష్ బాబు- రానా బృందం చేసిన సాయం గురించి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కి ఇబ్బందుల్లేకుండా ప్రచారం పరంగానూ ఎంతో సాయం చేశారు. రానా సమర్పకుడిగా ఆ చిత్రం రిలీజ్ చేయడంతో జనాల్లో చక్కని క్రేజు వచ్చింది. అంతకంటే ముందే విజయ్ దేవరకొండ - రీతు వర్మ జంటగా రాజ్ కందుకూరి నిర్మించిన `పెళ్లి చూపులు` చిత్రానికి డి.సురేష్ బాబు అండగా నిలిచారు. ఆ సినిమా రిలీజ్ సాఫీగా జరిగేందుకు సాయం చేసి పెద్దన్నగా నిలిచారు. దాంతో పెళ్లి చూపులు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే. జాతీయ అవార్డులు సైతం సొంతం చేసుకుని అన్ని పరిశ్రమల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. చాలా సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్ అండతో ఇటీవల రిలీజవుతున్నాయి.
ప్రస్తుతం ఓ అరడజను సినిమాలకు డి.సురేష్ బాబు అండాదండా పుష్కలంగా లభించడంపై పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సమంత - నందిని రెడ్డి కాంబినేషన్ సినిమా `ఓ బేబి`.. అల్లు శిరీష్ `ఏబీసీడీ` - ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న దొరసాని.. మలయాళ కల్ట్ క్రైమ్ డ్రామా `అంగామళై డైరీస్`.. తెలుగు రీమేక్ సినిమా `ఫలక్ నుమా దాస్`. పద్మశ్రీ చింతకింది మల్లేశం బయోపిక్ `మల్లేశం`.. మెంటల్ మదిలో కాంబినేషన్ రూపొందిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ `బ్రోచేవారెవరురా` .. ఇవన్నీ డి.సురేష్ బాబు సమర్పణలో తెరకెక్కుతున్నాయి కాబట్టి.. ఈ సినిమాల రిలీజ్ లకు ఎలాంటి అడ్డంకులు లేవని అర్థమవుతోంది. వీటన్నిటికీ సదరు అగ్ర నిర్మాత కం ఎగ్జిబిటర్ కం డిస్ట్రిబ్యూటర్ అండా దండా బిజినెస్ పరంగానూ సాయం కానుంది. ఇక క్రియేటివిటీ పార్ట్ లోనూ సదరు అగ్ర నిర్మాత నుంచి అనుభవ సాయం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్దాయన బ్యాకప్ అన్ని రకాలా సురక్షితం కాబట్టి ఈ సినిమాలకు టేబుల్ ప్రాఫిట్స్ షురూ అని విశ్లేషిస్తున్నారు. థియేటర్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి సినిమాలో మ్యాటర్ ఉంటే విజయం సాధించేందుకు ఛాన్సుంటుంది. ఇలాంటి కంటెంట్ డ్రివెన్ సినిమాలతో సదరు అగ్ర నిర్మాత ప్రయోగాలు చేయడం రిస్కుతో కూడుకున్నదే అయినా ప్రయత్నాన్ని ప్రశంసించి తీరాల్సిందే.