Begin typing your search above and press return to search.
టాలీవుడ్డోళ్లకు భాను ఎలా బురిడీ కొట్టించాడంటే
By: Tupaki Desk | 25 Jun 2016 11:27 AM GMTపరిటాల రవి పేరెత్తగానే మద్దెల చెరువు సూరి గుర్తుకొస్తాడు. సూరి పేరెత్తగానే భాను కిరణ్ గుర్తుకొస్తాడు. సూరికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూనే అతణ్నే మట్టుబెట్టిన ఘనుడు భాను. సూరి హత్య కేసులో జైలుకి వెళ్లి.. అక్కడి నుంచి దందాలు నడిపించిన ఘన చరిత్ర భానుది. ఈ భాను గురించి వస్తున్న తాజా వార్తలు తెలిస్తే దిమ్మదిరగడం ఖాయం. జైల్లో ఉంటూ సినీ.. వ్యాపార ప్రముఖుల్ని బురిడీ కొట్టించి ఇప్పటిదాకా రూ.150 కోట్ల దాకా కొల్లగొట్టాడట భాను. ఇదంతా అనంతపురం జైల్లో ఉంటూ సాగించిన దందానే కావడం విశేషం. తన మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి భాను.. ‘కోహ్లి గ్యాంగ్’ పేరుతో ఓ ముఠాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
జైలు నుంచే భాను 18 మంది సభ్యులతో ఓ ముఠాను ఏర్పాటు చేశాడట. బెంగళూరు కేంద్రంగా వ్యవహారాలు నడిపిన ఈ ముఠా.. వర్షాకాలంలో పిడుగులు పడే సమయంలో ఆకాశం నుంచి పడే శక్తిని ఒడిసిపడితే కోట్లాది రూపాయల ఖరీదు చేసే యురేనియం దక్కుతుందని ప్రచారం చేసింది. వీరి మాయ మాటలు నమ్మి తెలుగు.. కన్నడ సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు చాలామంది వ్యాపారవేత్తలు కూడా వీళ్లకు పెట్టుబడి కోసం డబ్బులు సమర్పించుకున్నారట. ఈ ‘కోహ్లి గ్యాంగ్’ బెంగుళూరులో ఒక ఆఫీసు కూడా పెట్టి వ్యవహారాలు నడపడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. తక్కువ పెట్టుబడితో భారీగా డబ్బులు వస్తాయన్న ఆశతో కోట్లు కోట్లు సమర్పించుకున్నారట చాలామంది ప్రముఖులు. ఐతే ఈ పెట్టుబడులన్నీ కలిపి రూ.150 కోట్ల దాకా సమకూరాక ఆ గ్యాంగ్ దుకాణం ఎత్తేసింది. దీంతో లబోదిబోమంటూ కొందరు టాలీవుడ్ నిర్మాతలు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. వాళ్లు విషయం ఏంటా అని ఆరా తీస్తే.. దీనికంతటికీ మూల కారకుడు భానునే అని.. జైలు నుంచి అతను మాస్టర్ ప్లాన్ అమలు చేశాడని తేలింది. మరి ఆ డబ్బంతా ఎలా రికవర్ చేస్తారో చూడాలి.