Begin typing your search above and press return to search.
సూర్య సెంచరీ కొట్టేశాడు
By: Tupaki Desk | 24 May 2016 10:20 AM GMTహిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రతిసారీ వైవిధ్యమైన సినిమా అందిద్దామనే చూస్తున్నాడు తమిళ కథానాయకుడు సూర్య. కమల్ హాసన్ తనకు ఆదర్శమని చెప్పే సూర్య.. ఆయన బాటలోనే ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. బ్రదర్స్.. రాక్షసుడు లాంటి సినిమాలు నిరాశ పరిచినా.. వెనుకంజ వేయకుండా ‘24’ లాంటి ప్రయోగాత్మక సినిమా చేసినందుకు సూర్యను అప్రిషియేట్ చేయాల్సింది. సూర్య చేసిన సాహసానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ వసూళ్లు వంద కోట్ల మార్కును అందుకున్నాయి.
నిర్మాత సూర్యనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కన్ఫమ్ చేస్తూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశాడు. తమిళ-తెలుగు భాషల్లో ఈ సినిమా మూడో వారంలోనూ మంచి వసూళ్లతో సాగుతోంది. తమిళంలో కంటే కూడా తెలుగులో ‘24’కు మంచి రెస్పాన్స్ రావడం విశేషం. ఇప్పటిదాకా సూర్య సినిమాలకు తమిళంతో పోలిస్తే తెలుగులో సగం వసూళ్లు వచ్చినా ఎక్కువే అనుకునేవాళ్లు. కానీ ‘24’ మాత్రం తమిళ వెర్షన్ కు దీటుగా వసూళ్లు సాధిస్తోంది. ‘24’ తెలుగు వెర్షన్ మాత్రమే రూ.35 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. షేర్ రూ.20 కోట్లకు పైనే ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ‘24’ తెలుగు వెర్షన్ దుమ్ముదులిపింది. ఇప్పటిదాకా మిలియన్ క్లబ్ కూడా టచ్ చేయని సూర్య.. ‘24’తో ఏకంగా 1.5 మిలియన్ దాటేశాడు. తెలుగుతో పోలిస్తే తమిళంలో రెస్సాన్స్ అంత గొప్పగా ఏమీ లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది ‘24’ తమిళ వెర్షన్. ఈ సినిమాను సూర్య స్వయంగా రూ.75 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం విశేషం.