Begin typing your search above and press return to search.

'24' టీజర్ పోస్టర్ అదిరిందిగా

By:  Tupaki Desk   |   1 March 2016 6:02 PM GMT
24 టీజర్ పోస్టర్ అదిరిందిగా
X
తెలుగులో ఇష్క్ - మనం చిత్రాలను తీసిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఓ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ పేరు '24'. ఈ టైటిల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమే కాదు.. అనేక అంచనాలకు కారణమైంది. ఆ తర్వాత సూర్య విభిన్న గెటప్స్ తో ఉన్న పోస్టర్స్ ని ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఇవి మరింత ఆసక్తిని కలిగించాయి. ఇప్పుడు మార్చి 4న సాయంత్రం 6 గంటలకు '24'మూవీకి టీజర్ రిలీజ్ చేస్తున్నామంటూ ఓ పోస్టర్ వేశారు.

ఇప్పటివరకూ ఈ మూవీ ఏ జోనర్ కి సంబంధించినదో.. ఎవరూ రిలీజ్ చేయలేదు. కాలంలో జర్నీ చేయడం అనే అంచనాలున్నా.. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే.. ఇప్పుడు విడుదల చేసిన టీజర్ పోస్టర్ తో ఓ అంచనాకు రావచ్చు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ అంతా గజిబిజి లెక్కలతో నిండిపోగా.. కేవలం ఒక హెల్మెట్ మాత్రమే కనిపిస్తుంది. ఇది సూర్య ఓ గెటప్ లో ధరించిన హెల్మెట్. దీన్ని సరిగ్గా లో ఒక కంటికి సైంటిఫిక్ గా పరిశీలించే డివైజ్ ఉండగా.. మరో కంటికి భూతద్దం లాంటిది సెట్ చేశారు. పైన ఓ మల్టీ యాంగిల్ టార్చ్ లైట్ కనిపిస్తుంది.

24 పోస్టర్ వీటిని చూసి.. హీరో కేరక్టర్ సైంటిస్ట్ అని ఓ అంచనాకు రావచ్చు. కాకపోతే క్లారిటీ రావాలంటే మాత్రం.. మార్చ్ 4వరకూ ఆగాల్సిందే. ఈ మూవీలో సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.