Begin typing your search above and press return to search.

అది తన తప్పే అంటున్న సూర్య

By:  Tupaki Desk   |   3 Jan 2017 7:30 PM GMT
అది తన తప్పే అంటున్న సూర్య
X
ఒక్కోసారి ఆవేశంలో ఏదో చేసేస్తాం. కానీ తర్వాత అలా చేసి ఉండాల్సింది కాదని ఫీలవుతాం. ఇప్పుడు స్టార్ హీరో సూర్య కూడా అలాగే రిగ్రెట్ అవుతున్నాడు. గౌతమ్ మీనన్ తో ఓ సినిమాకు సంబంధించి అప్పట్లో తాను ఇచ్చిన స్టేట్మెంట్ విషయంలో తప్పు చేశానని ఫీలవుతున్నాడు సూర్య. గౌతమ్ తో సూర్య కాక్క కాక్క.. వారణుమ్ ఆయురుం లాంటి మెమొరబుల్ మూవీస్ చేశాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో మూడోసారి ‘ధృవ నక్షత్రం’ అనే సినిమా మొదలు కావాల్సింది. కానీ గౌతమ్ వేరే ప్రాజెక్టుల్లో పడి ఈ చిత్రాన్ని మొదలుపెట్టడంలో ఆలస్యం చేశాడు. దీంతో సూర్యకు చిర్రెత్తుకొచ్చి.. ఈ సినిమా నుంచి తాను వైదొలగుతున్నట్లు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు.

ఐతే తనకు రెండు గొప్ప సినిమాలు ఇచ్చిన గౌతమ్ మీనన్ విషయంలో సూర్య ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది కాదన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు సూర్య కూడా ఇదే ఫీలవుతున్నాడు. తాను అప్పట్లో ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది కాదని వ్యాఖ్యానించాడు సూర్య. గౌతమ్ తో తనకు ఇంతకుముందు వచ్చిన విభేదాలు సమసిపోయాయని.. తామిద్దరం కలిసి ‘ధృవ నక్షత్రం’ సినిమాను పున: ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నామని సూర్య తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నట్లు కూడా చెప్పాడు సూర్య. మొత్తానికి సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీటవబోతుండటంతో తమిళ ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/