Begin typing your search above and press return to search.
సూర్య, బాల మూవీ క్రేజీ అప్ డేట్!
By: Tupaki Desk | 12 Sep 2022 9:42 AM GMTక్రేజీ కాంబినేషన్ లు మళ్లీ కలిసి పని చేస్తున్నాయంటే అభిమానుల్లో వుండే ఆనందం వేరు. ఇప్పుడు అదే ఆనందానికి లోనవుతున్నారు హీరో సూర్య అభిమానులు. హీరో సూర్య ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ బాల తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత వీరిద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గతంలో బాల రూపొందించిన 'నంద', 'పితాబగన్' వంటి సినిమాల్లో సూర్య నటించిన విషయం తెలిసిందే.
నటుడిగా హీరో సూర్యకు ఈ రెండు సినిమాలు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. దాదాపు 20 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత సూర్య, బాల.. ఈ వీరిద్దరూ కలిసి వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ 'వనాంగాన్'. ఇదే మూవీని తెలుగులో 'అచలుడు' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.
రీసెంట్ గా 'ఆకాశం నీ హద్దురా'. జై భీమ్ చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో సూర్య అదే జోష్ తో బాలతో సినిమా చేస్తున్నాడు. సూర్య నటిస్తున్న 41 ప్రాజెక్ట్ ఇది. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై హీరో సూర్య నటిస్తూ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాడు.
కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే కీలక షెడ్యూల్ ని పూర్తి చేశారు. అయితే ఈ మూవీ అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది అంటూ వార్తలు ఇటీవల షికారు చేశాయి. ఆ పేకార్లకు చెక్ పెడుతూ హీరో సూర్య ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దీంతో బాల, సూర్య కాంబినేషన్ లో రూపొందుతున్న 'వనాంగాన్' పై వస్తున్న రూమర్ లకు చెక్ పడింది. ఇదిలా వుంటే ఈ మూవీపై సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ తాజాగా క్రేజీ అప్ డేట్ ని అందించాడు.
ఈ మూవీ పాటల రికార్డింగ్ మొదలైందని సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ ఇచ్చాడు. ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వాస్తవిక కోణంలో సినిమాలని తెరకెక్కించే బాల ఈ మూవీని కూడా అదే పంథాలో రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో హీరో సూర్య సరికొత్త మేకోవర్ తో కనిపించబోతున్నాడు. టైటిల్ తో పాటు హీరో సూర్య ప్రీ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రగ్గ్డ్ లుక్ లో కనిపించిన సూర్య గెటప్ విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
సూర్య ఈ మూవీతో పాటు వెట్రిమారన్ డైరెక్షన్ లో 'వడివాసల్', 'సిరుతై' శివ డైరెక్షన్ లో పీరియాడిక్ ఫిల్మ్ ని చేయబోతున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలొ రూపొందనున్న పీరియాడిక్ ఫిల్మ్ ని మొత్తం 10 భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.