Begin typing your search above and press return to search.
కేరళకు బ్రదర్స్ 25లక్షల డొనేషన్
By: Tupaki Desk | 12 Aug 2018 4:55 AM GMTవరదలు - ఉప్పెనల వేళ ప్రజల్ని ఆదుకోవడంలో సినీసెలబ్రిటీలు ముందు వరుసలో నిలుస్తున్నారు. స్థానికంగానే కాకుండా, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలకు ప్రజా జీవనం అల్లకల్లోలం అయినప్పుడు తలో కొంత సాయం చేస్తున్నారు. దీనివల్ల కొంతలో కొంత మేలు జరుగుతోంది. వరదల్లో సమయానికి ఆహారం అందక - సరైన బట్టలు లేక - నిత్యావసరాలు అందక ఆకలితో అలమటించే దారుణమైన పరిస్థితి ఉంటుంది. అలాంటి అత్యవసర సన్నివేశంలో ఆదుకునేవాడిని దేవుడిగానే చూస్తారు ప్రజలు. ప్రస్తుతం కేరళలో సన్నివేశం దారుణంగా ఉంది. అక్కడ ప్రజా జీవనం స్థంబించింది. వరదలు ముంచెత్తడంతో కకావికళం అయిపోయారు జనం. త్రివేండ్రం - ఆలువా - పలక్కాడ్ - వేయాండ్ వంటి చోట్ల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో ప్రభుత్వం రెస్క్యూ టీమ్ లను బరిలో దించింది. వేలాదిగా ప్రజలు నిరాశ్రయులవ్వడంతో వారిని ఆదుకోవాల్సిన అత్యవసర పరిస్థితిని ఈ టీమ్ లు సమీక్షిస్తున్నాయి.
ఆ క్రమంలోనే కేరళను ఆదుకునేందుకు కోలీవుడ్ నుంచి తొలిగా స్పందించిన హీరో విశాల్. కేరళ రాష్ట్ర ప్రజల్ని ఆదుకునేందుకు విశాల్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. అవసరం మేర ఆహారం - వస్త్రాలు - నిత్యావసరాల్ని వరదబాధితులకు అందించేందుకు నేడు ఓచోట కలుసుకోవాల్సిందిగా అందరినీ కోరాడు. అందుకు అభిమానుల నుంచి చక్కని స్పందన వచ్చింది.
ఆ క్రమంలోనే ఇతర కోలీవుడ్ హీరోల్లోనూ కదలిక వచ్చింది. కేరళ ప్రజల సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి సూర్య - కార్తీ బ్రదర్స్ 25లక్షల విరాళాన్ని డొనేట్ చేశారు. సీఎం పినరయి విజయన్ పిలుపు మేరకు స్పందిస్తూ పెద్ద మొత్తాన్ని డొనేట్ చేసిన హీరోలుగా బ్రదర్స్ పేరు తొలిగా వినిపిస్తోంది. మునుముందు మరింత మంది సెలబ్రిటీలు కేరళ ప్రజల్ని ఆదుకునేందుకు డొనేషన్లు ప్రకటించే సన్నివేశం కనిపిస్తోంది. ఇప్పటివరకూ టాలీవుడ్ నుంచి నో రెస్పాన్స్. బహుశా ఈరోజు సన్నివేశాన్ని బట్టి మనోళ్లు స్పందిస్తారేమో చూడాలి. సినీరాజకీయ యవనికపై దూకుడుమీద ఉన్న రజనీకాంత్ - కమల్ హాసన్ వరదబాధితుల సాయంపై నేడు స్పందిస్తారేమో చూడాలి.