Begin typing your search above and press return to search.

సూర్య, సమంత.. డబ్బింగ్ చెప్పేస్తున్నారా?

By:  Tupaki Desk   |   10 March 2016 9:49 AM GMT
సూర్య, సమంత.. డబ్బింగ్ చెప్పేస్తున్నారా?
X
24.. ఇప్పుడు టాలీవుడ్ - కోలీవుడ్ లలో క్రేజీ ప్రాజెక్ట్ ఇది. సూర్య మూడు విభిన్న పాత్రలు పోషిస్తుండడం, మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ మూవీపై ముందునుంచీ అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్ ఈ ఎక్స్ పెక్టేషన్స్ ను తారా స్థాయికి చేర్చేసింది. 24కు మరింత ఆకర్షణ తెచ్చేందుకు, హైప్ తీసుకొచ్చేందుకు తెలుగు నిర్మాతలు ట్రై చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా సూర్య ద్వారా ఒరిజినల్ వాయిస్ ని ప్రేక్షకులకు పరిచయం చేయాలన్నది ఆలోచన.

24లో సూర్య మూడు వేరియషన్స్ ఉన్న మూడు రకాల పాత్రలు చేస్తుండడంతో.. వీటిలో ఒక పాత్రకు సూర్యను డబ్బింగ్ చెప్పమని అడిగారట. ప్రస్తుతం ఎస్3(సింగం3) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సూర్య. డబ్బింగ్ చెప్పడం, అందులోనూ తెలుగు వెర్షన్ కోసం అంటే ఖచ్చితంగా ఎక్కువగానే టైం వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, వీలు చూసుకుని తప్పకుండా ఓ రోల్ కు ఓన్ డబ్బింగ్ చెబ్తానని సూర్య అన్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు చెన్నై బ్యూటీ సమంత కూడా 24తోనే తన సొంత గొంతును తెలుగు ప్రేక్షకులకు వినిపించబోతోంది. మొదటిసారిగా ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అవుతోంది. మొత్తానికి ఒకే సినిమా ద్వారా సూర్య - సమంతలు ఒకే సినిమా ద్వారా తెలుగు డబ్బింగ్ స్టార్ట్ చేయనుండడం విశేషమే.