Begin typing your search above and press return to search.
తమ్ముడు ఫెయిలైన పాత్రలోనే అన్న
By: Tupaki Desk | 4 July 2017 12:30 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత చిత్రం సింగం3 అంతగా ఆకట్టుకోలేదు. దానికి ముందు 24 చిత్రానికి మంచి పేరు గుర్తింపు వచ్చినా డబ్బులు రాలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్న సూర్య.. నయనతార లవర్ గా చెప్పుకుంటున్న విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'తానా సేరేంద్ర కూటం' సినిమా చేస్తున్నాడు.
ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. సూర్య తనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేయగా.. కొత్త సినిమాపై కూడా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడట సూర్య. మాధవన్ తో ఇరుధు సూత్రు అంటూ.. అదే సినిమాను తెలుగులో గురు పేరుతో వెంకటేష్ తో తీసి హిట్ కొట్టిన సుధ కొంగర దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ స్టోరీని లాక్ చేసుకునే పనిలో ఉన్నారట సూర్య.. సుధ కొంగర. ఈ చిత్రాన్ని కూడా సూర్యనే నిర్మించనుండగా.. ఇందులో సూర్య పాత్ర ఓ పైలెట్ అని తెలుస్తోంది.
రీసెంట్ గా సూర్య తమ్ముడు కార్తి కూడా పైలెట్ పాత్ర చేశాడు. మణిరత్నం మూవీ చెలియాలో కార్గిల్ వార్ లో పోరాడే పైలెట్ గా నటించాడు కార్తీ. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. తమ్ముడు అదే రోల్ లో ఫెయిల్ అయితే.. ఇప్పుడు అలాంటి పాత్రతోనే అన్న సినిమా చేయాలని ఆలోచిస్తుండడం ఆశ్చర్యకరమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/