Begin typing your search above and press return to search.
గ్యాంగ్ తో అర్ధరాత్రి టీ
By: Tupaki Desk | 11 Jan 2018 11:04 AM GMTటాలీవుడ్ సంక్రాంతి సినిమాల హడావిడిలో సైలెంట్ కిల్లర్ గా వస్తున్న సినిమా సూర్య గ్యాంగ్. ఒకప్పుడు తెలుగులో సైతం భారీ మార్కెట్ ఉన్న సూర్య ఆ మధ్య వరస పరాజయాలు పలకరించడంతో కొంచెం స్లో అయ్యాడు. 24 సినిమా హిట్ అనిపించుకున్నా అతని మార్కెట్ ని పూర్తిగా వెనక్కు తేగలిగే సినిమా కాలేకపోయింది. సింగం 3 అంతంత మాత్రంగానే ఆడటంతో సూర్య బాగా కసిగా ఉన్నాడు. గ్యాంగ్ సినిమా హిందీ సినిమా స్పెషల్ చబ్బీస్ కు రీమేక్ అయినప్పటికీ ఆ ఛాయలు కొన్ని మాత్రమే ఇందులో ఉంటాయని చెబుతున్న సూర్య మన ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టు దర్శకుడు విజ్ఞేశ్ శివన్ చాలా మార్పులు చేసినట్టు చెబుతున్నాడు. కీలకమైన కొన్ని సన్నివేశాలు తప్ప మిగిలినదంతా ఒరిజినల్ చూసినవాళ్ళకు కూడా కొత్త అనుభూతిని ఇస్తుందని హామీ ఇస్తున్నాడు.
ఇక ఈ సినిమా కోసం చెన్నై వీధుల్లో అర్ధరాత్రి విజ్ఞేశ్ శివన్ తో కలిసి తిరిగానని, ప్రజల జీవన శైలి దగ్గర నుంచి గమనించడం నాకు దీని వల్లే తెలిసిందని చెప్పాడు. బయట టీ తాగి చాలా కాలం అయ్యిందని, దీని పుణ్యమా అని విజ్ఞేశ్ తనను ఏళ్ళకు ఏళ్ళు వెనక్కు తీసుకెళ్ళాడని సంబరపడ్డాడు సూర్య. సినిమాని కెరీర్ గా తీసుకోక ముందు ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో 720 రూపాయల జీతానికి పని చేసిన తనకు నాన్న శివ కుమారే మార్గదర్శి అని చెబుతున్నాడు.
హీరో అయ్యాక హోటల్స్ - సెట్స్ - విమానాలు తప్ప ఇంకే ప్రపంచం లేకుండా అయ్యిందని - నలుగురిలో తిరిగి కష్టసుఖాలు తెలుసుకోవాలి అని ఉన్నా స్టార్ స్టేటస్ వాటికి అవకాశం ఇవ్వదని చెప్పాడు. తెలుగు సినిమా చేయాలనీ ఉన్నా కుదరడం లేదని - తమ్ముడు కార్తి లాగా ఖచ్చితంగా చేస్తానని చెబుతున్నాడు. పోటీ గురించి చెబుతూ తమిళనాడు కంటే రెట్టింపు థియేటర్స్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో పవన్ - బాలయ్య తో తాను పోటీ పడుతున్నాను అనుకోవడం లేదని చెబుతున్న సూర్య గ్యాంగ్ సక్సెస్ మీద మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.