Begin typing your search above and press return to search.
హీరో డాడ్ పెయింటింగ్స్ అదుర్శ్ అంతే
By: Tupaki Desk | 24 Oct 2016 10:30 PM GMTకోలీవుడ్ హీరోలయిన సూర్య.. కార్తిల ఫాదర్ శివకుమార్ కూడా సినిమా యాక్టరే. 170 సినిమాల్లో లీడ్ రోల్స్ చేసిన ఈయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
కోలీవుడ్ సీనియర్ నటుడు శివకుమార్.. యాక్టింగ్ కంటే ఎక్కువగా ఈయనకు పెయింటింగ్స్ పై మక్కువ చూపుతారు. శివకుమార్ చిన్ననాటి నుంచి వేసిన పెయింటింగ్స్ తో ఓ పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి.. తండ్రికి సూపర్బ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు సూర్య.. కార్తిలు. ఈనెల 27న శివకుమార్ 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వేసిన బొమ్మలను చూసిన వారందరూ ఔరా అంటున్నారంతే.
పెన్సిల్ ఆర్ట్స్.. క్రేయాన్ పిక్చర్స్.. స్కెచెస్.. వాటర్ కలర్స్.. ఆయిల్ పెయింటింగ్స్ తో పాటు పలువురు ప్రముఖుల పోర్ట్రెయిట్స్ కూడా ఈ ఎగ్జిబిషన్ లో దర్శనమిచ్చాయి. అన్నిటి కంటే ఎక్కువగా తండ్రి స్వయంగా వేసిన చిన్ననాటి సూర్య పెయింటింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కు ఈయన ప్రిన్సిపాల్ గా కూడా పని చేశారు. ఈయన అసలు పేరు పళని స్వామి కాగా.. శివకుమార్ అనేది స్క్రీన్ నేమ్.
పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో భాగంగా తండ్రి వేసిన 140 పెయింటింగ్ పిక్చర్స్ తో ఓ కాఫీ టేబుల్ బుక్ కూడా రిలీజ్ చేయడం విశేషం. అయితే పెయింటింగ్స్ చూసిన వారందరూ 'అదుర్శ్' అనడం తప్పిస్తే మరో మాటను చెప్పట్లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/