Begin typing your search above and press return to search.
సూర్య తొలి పారితోషకం ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 22 Jan 2017 3:55 PM GMTసౌత్ ఇండియాలో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పది కోట్లకు అటు ఇటుగా పారితోషకాలు తీసుకుంటున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సూర్య పది కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండొచ్చు. ఐతే ఇప్పుడా స్థాయిలో పారితోషకం అందుకుంటున్న సూర్య.. సినిమాల్లోకి వచ్చిన తొలి నాళ్లలో అందుకున్న తొలి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? కేవలం 740 రూపాయలేనట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సూర్యనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పుడు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నప్పటికీ.. తాను తీసుకున్న తొలి పారితోషకమే ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పాడు సూర్య.
ఇక కొత్తగా నిర్మాత అవతారమెత్తి సినిమాలు నిర్మిస్తుండటం గురించి సూర్య స్పందిస్తూ..‘‘24 లాంటి సినిమా ప్యాషన్ తో నిర్మించాలి. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఆ బాధ్యత నేనే తీసుకున్నా. నా రెమ్యూనరేషన్ కూడా సినిమా మేకింగ్ కోసమే ఉపయోగించాం. డబ్బు గురించే ఆలోచిస్తే ఔట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఇలా రిస్కుతో కూడుకున్న సినిమాల్ని నేనే నిర్మిస్తాను’’ అని సూర్య చెప్పాడు. తన కొత్త సినిమా ‘ఎస్3’ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది కేవలం మాస్ ప్రేక్షకుల కోసం తీసిన సినిమా కాదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తుంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు అన్ని అంశాలూ ఉంటాయి. సింగం సిరీస్ లో గత రెండు సినిమాల మాదిరే ఇదీ ఆకట్టుకుంటుంది’’ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/