Begin typing your search above and press return to search.
టాలీవుడ్ స్టార్లను వెనక్కి నెట్టేసిన సూర్య?
By: Tupaki Desk | 13 Dec 2017 10:40 PM GMTకోలీవుడ్ స్టార్ హీరోకు తమిళంలో ఎంత ఫాలోయింగ్ ఉందో.. దానికి దీటుగా తెలుగులోనూ ఆదరణ ఉంది. గత కొన్నేళ్లలో సూర్య మార్కెట్ కొంచెం దెబ్బ తిన్నప్పటికీ.. ఇంకా అతడి ఫాలోయింగ్ ఏమీ తగ్గలేదు. ఆ విషయం సూర్య కొత్త సినిమా ‘గ్యాంగ్’ టీజర్ కు దక్కిన ఆదరణను బట్టి రుజువైంది. తమిళంలో గత నెలలోనే రిలీజైన టీజర్ ను తెలుగులోకి అనువదించి నిన్ననే రిలీజ్ చేశారు. ఈ టీజర్ యూ ట్యూబ్ లో ఒక్క రోజులో మిలియన్ వ్యూస్ అందుకోవడమే కాదు.. అనూహ్యంగా 2 లక్షలకు పైగా లైక్స్ కూడా తెచ్చుకుంది. 24 గంటల వ్యవధిలో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న తెలుగు టీజర్ ఇదే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటిదాకా 24 గంటల వ్యవధిలో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న టీజర్ రికార్డు ‘జై లవకుశ’ పేరిట ఉంది. ఆ టీజర్ కు ఒక్క రోజులో 1.92 లక్షల లైక్స్ వచ్చాయట. తర్వాతి స్థానంలో ‘స్పైడర్’ టీజర్ ఉంది. అది 1.9 లైక్స్ తెచ్చుకుంది. ‘కాటమరాయుడు’ టీజర్ కు 24 గంటల్లో 1.46 లక్షల లైక్స్ వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటినీ దాటేసి ఓ తమిళ హీరో నటించిన డబ్బింగ్ సినిమా టీజర్ కొత్త రికార్డు నెలకొల్పడమంటే మాటలు కాదు. పాత రికార్డుల మాటేమో కానీ.. ‘గ్యాంగ్’ టీజర్ కు 24 గంటల్లో 2.03 లక్షల లైక్స్ వచ్చిన మాట మాత్రం వాస్తవం. వ్యూస్ 10 లక్షలే ఉండగా.. 2 లక్షల లైక్స్ రావడమంటే ఆశ్చర్యమే. తమిళ అభిమానులకు టీజర్- ట్రైలర్ వ్యూస్.. లైక్స్ రికార్డుల విషయంలో బాగా పిచ్చి ఉంటుంది. మరి సూర్య తమిళ ఫ్యాన్స్ ఇలా పనిగట్టుకుని రికార్డు కొట్టే ప్రయత్నం చేశారా.. లేక ఇది రియల్ రికార్డా అన్నది చూడాలి.