Begin typing your search above and press return to search.
సూర్య గెలవాలి అంటే
By: Tupaki Desk | 11 Jan 2018 6:26 AM GMTమహా సంగ్రామాన్ని తలపిస్తున్న సంక్రాంతి సినిమా పోరులో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు మూడు ఉండగా వాటికి ధీటుగా ఈ సారి ఒక తమిళ డబ్బింగ్ సినిమా కూడా రంగంలో ఉంది. అదే సూర్య నటించిన గ్యాంగ్. ఈ టైంలో వేరే నిర్మాత అయితే ఇంత రిస్క్ చేసేవాడు కాదేమో కాని దీన్ని విడుదల చేస్తోంది యువి లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ కాబట్టి హైప్ స్లోగా వస్తోంది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి నిన్న విడుదలై డివైడ్ టాక్ తో రన్ అవుతుండగా, రేపు వస్తున్న జైసింహతో సూర్య నేరుగా తలపడాలి. ఇమేజ్ - మార్కెట్ - మాస్ ఫాలోయింగ్ విషయంలో బాలయ్య ఒక అడుగు ముందు ఉన్నట్టు అనిపిస్తున్నా సూర్యకున్న ఫ్యాన్స్ తెలుగులో కూడా తక్కువేమీ లేరు. ఆ నమ్మకంతోనే యువి సంస్థ పోటీకి భయపడకుండా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.
నిజానికి గ్యాంగ్ కి ఇంత మించిన సమయం కాని, ఆప్షన్ కాని లేదు. తమిళ్ లో మాత్రమే విడుదల చేసి తెలుగులో వాయిదా వేస్తే ఎలాగూ తమిళ్ రిపోర్ట్స్ తెలిసిపోతాయి కాబట్టి పోస్ట్ పోన్ చేస్తే ఓపెనింగ్స్ మీద అది ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే కంటెంట్ మీద నమ్మకంతో యువి సంస్థ పోటీకే సై అంది. గతంలో శర్వానంద్ తో తీసిన ఎక్స్ ప్రెస్ రాజా కూడా రెండేళ్ళ క్రితం బాలయ్య - జూనియర్ ఎన్టీఆర్ - నాగార్జునతో పోటీ పడి విజయం సాధిస్తే, అదే శర్వానంద్ తో తీసిన మహానుభావుడు ఏకంగా మహేష్ బాబు - జూనియర్ ఎన్టీఆర్ సెగను తట్టుకుని మంచి కలెక్షన్స్ సాధించింది. చెప్పాలంటే ఇది ఒకరకంగా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారేమో
అందుకే సూర్య గ్యాంగ్ విషయంలో కూడా పోటీని పెద్దగా పట్టించుకోవడం లేదు యువి సంస్థ. ఒక పక్క సాహో భారీ నిర్మాణం, మరోపక్క ఈ నెలాఖరులో విడుదల చేయాల్సిన అనుష్క భాగమతి ప్రమోషన్ ఇన్నేసి ఉన్నాయి కాబట్టి ధైర్యంగా గ్యాంగ్ ని వదిలేందుకే నిర్ణయించుకున్నారు. మరి సూర్య నెగ్గుతాడా లేదా అనేది రేపు తేలిపోతుంది. హిందిలో వచ్చిన అక్షయ్ కుమార్ సూపర్ హిట్ మూవీస్ స్పెషల్ చబ్బీస్ కు ఇది రీమేక్. కీర్తి సురేష్ సూర్యకు జోడిగా నటించింది.