Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: గ్యాంగ్ కోసం గొంతు మారింది
By: Tupaki Desk | 13 Dec 2017 4:08 PM GMT'తానా సెరందా కూటం' అంటూ ఇప్పుడు తమిళంలో ఒక సినిమా వస్తోంది. మొన్నటివరకు పెద్దగా బజ్ లేకపోయినా.. ఒక్కసారి టీజర్ వచ్చేసరికి ఎక్కడాలేనంత హైప్ వచ్చేసింది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో సూర్య అయితే.. గతంలో నానుమ్ రౌడీ దాన్ సినిమాతో ఇంప్రెస్ చేసిన నయనతార ప్రియుడు విజ్ఞేష్ శివన్ డైరక్ట్ చేస్తున్నాడు. అయితే తమిళ టీజర్ ఎప్పుడో వచ్చినా కూడా.. తెలుగు మాత్రం లేటైంది. అందుకు ఓ కారణం ఉందిలే.
తెలుగులో ఈ సినిమాను ''గ్యాంగ్'' అంటూ దించుతున్నారు. సినిమాలో హీరో సూర్య ఒక పోలీస్ పాత్రను కాకుండా.. సిబిఐ ఆఫీసర్ తరహాలో ఉండే పాత్ర ఏదో చేస్తున్నాడని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఎప్పటిలాగానే సూర్య తన లుక్ తో బాడీ లాంగ్వేజ్ తో బాగా ఇంప్రెస్ చేశాడు. అలాగే హీరో ప్రక్కనే కనిపిస్తున్న రమ్యకృష్ణ కూడా కామెడీ పుట్టించే పాత్రలో ఇంప్రెస్ చేసింది. ఇక కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ లో బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే.. ఎప్పుడూ సూర్యకు డబ్బింగ్ చెప్పే గొంతు కాకుండా.. ఒక కొత్త గొంతుతో వాయిస్ ఇచ్చారు. ఆ గొంతు ఎవరిదో తెలుసా?
ఇంకెవరిది అనుకున్నారు.. స్వయంగా సూర్య నే ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నాడు. చాలా రోజులపాటు తెలుగును ప్రాక్టీస్ చేయడం వలన ఉచ్ఛరణతో మాట స్వచ్ఛత కూడా బాగుంది. డబ్బింగ్ అదిరిపోయిందే అని ఎవరైనా కూడా అనుకోవాల్సిందే. ఇకపోతే అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ఒక ఎసెట్ అని చెప్పొచ్చు.