Begin typing your search above and press return to search.

గ్యాంగ్ రీమేక్ కష్టాలు తీరాయ్!!

By:  Tupaki Desk   |   8 Jan 2018 5:38 AM GMT
గ్యాంగ్ రీమేక్ కష్టాలు తీరాయ్!!
X
సినిమాలు-వివాదాలు కలిసి కాపురం చేయడం స్టార్ట్ చేసి చాలా కాలమే అయింది. కాంట్రవర్సీలతో కొందరు ప్రచారం చేసుకుంటే.. రిలీజ్ కి ముందు అడ్డంకులు సృష్టించి డబ్బులు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు మరికొందరు. కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీకి ఈ రెండో రకం కష్టాలు వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఇప్పటికే ఓ పాట విషయంలో రాజకీయ దుమారం ఎదుర్కొంటున్న తానా సేరేంద్ర కూట్టంకు.. రీమేక్ రైట్స్ విషయంలో మరో ఇబ్బంది వచ్చింది. ఇది బాలీవుడ్ మూవీ స్పెషల్ 26కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే.. ఇలా రీమేక్ చేసేందుకు తాము హక్కులు కొనుగోలు చేశామంటూ.. హీరో ప్రశాంత్ తల్లి శాంతి త్యాగరాజన్ కోర్టులో కేసు వేశారు. కానీ ఈ కోర్టును మద్రాస్ కోర్టు కొట్టివేయడంతో.. సూర్య గ్యాంగ్ ఊపిరి పీల్చుకుంది. అయితే.. ఇలా కేసు కొట్టేసేందుకు కోర్టు పరిగణించిన అంశాలను తెలుసుకుంటే ఆశ్చర్యం వేయకమానదు.

2016 సెప్టెంబర్ హక్కులు ప్రశాంత్ తల్లి.. స్పెషల్ 26 హక్కులు కొనుగోలు చేయగా.. ఏడాది కాలంపాటు మాత్రమే ఈ రీమేక్ రైట్స్ అమల్లో ఉంటాయి. ఈలోగా ప్రాజెక్టు పట్టాలెక్కకపోతే అగ్రిమెంట్ మురిగిపోతుంది. అయితే.. సరిగ్గా టీఎస్ కే రిలీజ్ కి ముందు కోర్టుకు వెళ్లడం.. అఢ్డంకులు సృష్టించేందుకు ట్రై చేసిన ప్రశాంత్ అండ్ టీంకు.. ఈ అగ్రిమెంట్ లో క్లాజ్ తెలియదా అనిపించక మానదు.