Begin typing your search above and press return to search.
సూర్య మార్కెట్ ని పెంచుకుంటాడా ?
By: Tupaki Desk | 28 May 2019 5:30 PM GMTఒక టైంలో సూర్య సినిమా అంటే మన స్టార్లకు ధీటుగా విడుదలయ్యేవి. ధియేటర్ల దగ్గర కోలాహలం మాములుగా ఉండేది కాదు. కాని గత కొంతకాలంగా ఒకే మూసలో చేస్తున్న సూర్య మూవీస్ మనవాళ్ళకు నచ్చడం లేదు. సింగం సిరీస్ విసుగు తెప్పించేయగా ప్రయోగాల పేరుతో ట్రై చేసిన గ్యాంగ్-రాక్షసుడు లాంటివి ఆశించిన ఫలితాలు అందుకోలేదు. అందుకే ఇంకో మూడు రోజుల్లో ఎన్జికె రిలీజవుతున్నా దాని తాలుకు సందడి పెద్దగా కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ కూడా చాలా స్లోగా ఉంది.
సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో సాయి పల్లవి రకుల్ ప్రీత్ సింగ్ హీరొయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ప్లాన్ చేశారు. సూర్యకు ఇది ఒకరకంగా పబ్లిక్ ఎగ్జాం లాంటిది. టాలీవుడ్ లో డౌన్ అయిన తన మార్కెట్ ని వెనక్కు రాబట్టుకోవాలి అంటే ఇదే మంచి ఛాన్స్. పెద్దగా పోటీ ఏమి లేదు. ఫలక్ నుమా దాస్ తో పాటు అభినేత్రి 2 విడుదలవుతున్నాయి కాని సూర్య రేంజ్ తో పోల్చుకోదగినవి కాదు.
కాబట్టి కంటెంట్ బాగుండి ఎన్జికె టాక్ కనక పాజిటివ్ గా వస్తే వసూళ్ళ పరంగా మంచి నమ్మకం పెట్టుకోవచ్చు. ఒకప్పుడు గజినీ లాంటి సినిమాలతో తెలుగులో సైతం హండ్రెడ్ డేస్ రేంజ్ సక్సెస్ చేసిన సూర్య ఇప్పుడు ఇంత లో బజ్ తో తన సినిమా రావడం అంటే కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. ట్రైలర్ కు మంచి స్పందనే వచ్చినప్పటికీ ఆడియో పెద్దగా కనెక్ట్ కాలేదు. చాలా రిస్క్ అనిపించే పొలిటికల్ థ్రిల్లర్ తో సూర్య ఎంత వరకు మెప్పించబోతున్నాడో ఇంకో మూడు రోజుల్లో తేలిపోతుంది