Begin typing your search above and press return to search.
బాహుబలి- 2లో సూర్య?!
By: Tupaki Desk | 25 Jun 2015 3:30 PM GMTసినిమా అంటే మార్కెట్ మాయాజాలం. ఇక్కడ మార్కెట్ పెంచుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఎంతకైనా తెగించాలి. కాసుల వర్షం కురిపించే ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టకూడదు. అయితే ఇలాంటి ఫార్ములాని అనుసరించడంలో రాజమౌళి దిట్ట. కేవలం తెలుగు ప్రజలే లక్ష్యంగా బాహుబలిని మొదలెట్టాడు. అది కాలక్రమంలో తమిళ్, హిందీ మార్కెట్ల వరకూ విస్తరించింది. నెమ్మదిగా ప్రపంచ మార్కెట్‌పైనే కన్నేశాడు. దానికి తగ్గట్టే బడ్జెట్ కూడా పెరిగింది.
అయితే 'బాహుబలి : ది బిగినింగ్' విషయంలో ఒకే ఒక్క తప్పిదం జరిగిందన్నది వాస్తవం. ఈ సినిమాని ముందే తమిళ్, హిందీ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించి ఉంటే కచ్ఛితంగా ఆయా భాషలకు చెందిన హీరోల్ని ప్రధాన పాత్రల్లోకి తీసుకొచ్చేవాడు రాజమౌళి. కానీ అలా జరగలేదు. కేవలం ప్రభాస్‌ని సూపర్‌హీరోని చేయడమే లక్ష్యంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
వాస్తవానికి ప్రభాస్, రానా ఇద్దరూ తమిళ్‌లో అంత పాపులారిటీ ఉన్న హీరోలు కాదు. మరీ అంత ఎక్కువ తెలీదు. రానా ఇటీవలి కాలంలో ఒకటి అరా చిత్రాల్లో నటించినా అవన్నీ కేవలం అతిధి పాత్రల్లాంటివే. హీరోగా రానా అక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. హిందీ పరిశ్రమతో ప్రభాస్‌కి అస్సలు పరిచయమే లేదు. అలాగే రానా తెలిసినా మరీ అంత క్రేజు, ఇమేజ్ లేదు. కాబట్టి ఈ రెండు పరిశ్రమల్లో అక్కడి లోకల్ హీరోల్ని కీలకపాత్రధారుల్ని చేస్తే బాహుబలి రేంజు మరింత పెరిగేదే.
అందుకే రాజమౌళి తొలిభాగంలో చేసిన తప్పును రెండో భాగంలో రిపీట్ కానివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆ పనిలో భాగంగానే బాహుబలి -2లో హీరో సూర్య కోసం ఓ కీలకపాత్రని క్రియేట్ చేస్తున్నాడని తెలుస్తోంది. సూర్య ఇప్పటికే బాహుబలిలో అవకాశం కావాలంటూ ఓపెన్‌గానే అభ్యర్థించాడు. ఆ విన్నపాన్ని రాజమౌళి దృష్టిలో పెట్టుకున్నాడని అంటున్నారు. ఇంతవరకూ రెండో భాగానికి సంబంధించి 35శాతం సీన్లే తెరకెక్కించారు. అంటే ఇంకా 65శాతం టాకీ తెరకెక్కించాల్సి ఉంది. ఈ పార్ట్‌లో సూర్యకి ఛాన్సున్నట్టే.
సూర్య రంగంలోకి దిగితే ఇది కచ్ఛితంగా తమిళ మార్కెట్లో ప్రభంజనానికి తెర లేపినట్టే. అలాగే బాహుబలి తొలిభాగం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చేసిన హల్‌చల్‌ని బట్టి అక్కడి లోకల్ హీరోని పార్ట్ -2లోకి దించే అవకాశాల్ని కొట్టి పారేయలేం. రాజమౌళి నోటి నుంచే ఆ వార్త అధికారికంగా వెలువడితే బావుంటుంది.