Begin typing your search above and press return to search.
ఇంటర్యూ: నా కళ్లు చూసి పడిపోతారంతే
By: Tupaki Desk | 25 May 2015 5:30 AM GMTహీరో సూర్య 'రాక్షసుడు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓ వైపు భార్య సినిమా '36వయదినిలే' ప్రమోషన్, రాక్షసుడు ప్రమోషన్ రెండిటితో బిజీ బిజీ. లేటెస్టుగా అతడి ముచ్చట్లలో కొన్ని ఆసక్తికర సంగతులివి..
=వెంకట్ ప్రభు నేను స్కూల్ మేట్స్. అందుకే కలిసి సినిమా చేశాం. రాక్షసుడు (మాస్) తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ వారంలో. ఇటు పెద్దలు, అటు పిల్లలు ఇరువురికి నచ్చే సినిమా ఇది.
=తెలుగువారిలో రాజమౌళి, ప్రభాస్ గురించి మాట్లాడాలి. బాహుబలి గురించి ముచ్చటించాలి ముఖ్యంగా భారతదేశం గర్వించదగ్గ సినిమా 'బాహుబలి'. ఈ సినిమా రెండో భాగంలో అవకాశం వస్తే నటించడానికి సిద్ధమే. రాజమౌళి సర్ ఛాన్సిస్తానంటే నేను నటించడానికి రెడీ. మీరూ కూడా ఓ మాట చెప్పండి ప్లీజ్.
=ప్రభాస్‌లోని చిత్తశుద్ధి నాకు బాగా నచ్చుతుంది. అతడు ఎంతో నిజాయితీగా కష్టించే హీరో. అంత పెద్ద స్టార్ ఒక సినిమా కోసం మూడేళ్ల పాటు కేటాయించడం అంటే ఆషామాషీ కాదు.
=టాలీవుడ్‌లో నాకు చరణ్, బన్ని, నాగ్ సర్, ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్ అందరూ స్నేహితులే. జాబితా చాలా పెద్దదే ఉంది. మేం నిత్యం ఇళ్లలో జరిగే వేడుకలకు కలుస్తుంటాం. అంతేకాదు.. వీలున్నప్పుడల్లా కలుస్తూనే ఉంటాం.
=కార్తీ కంటే ముందే తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలనుకున్నా. దర్శకుడితో మంతనాలు అయ్యాయి. కానీ ఎందుకనో ఆలస్యమైంది. సాధ్యమైనంత త్వరలోనే తెలుగు సినిమా చేస్తాను.
=నా కళ్లు బావుంటాయని చాలామంది అమ్మాయిలు మెచ్చుకుంటుంటారు. అవి జన్మత: వచ్చినవి. అమ్మానాన్న ఇచ్చిన గిఫ్ట్.
=కార్తీకి నాకు తెలుగు, తమిళ్‌లో పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి ఎవరైనా దర్శకనిర్మాతలు పెద్ద పెట్టుబడులతో వచ్చినా అది వర్కవుటవుతుంది. అలాగే నేటివిటీ టచ్ ఉంటేనే మేం తమిళ్‌లో నటించిన సినిమాల్ని తెలుగులో అనువదించి రిలీజ్ చేస్తున్నాం. కార్తీ నటించిన మద్రాస్ కేవలం తమిళ్ నేపథ్యం ఉన్న సినిమా. దాన్ని తెలుగులో అందుకే రిలీజ్ చేయలేదు. అనవసరంగా తెలుగువారిపై రుద్దే పని చేయలేం.
=ప్రస్తుతం విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. అది సాహసాలతో కూడుకున్న సినిమా. అలాగే హైకూ అనే చిన్నపిల్లల సినిమా చేస్తున్నా. పిల్లలకు నచ్చే సినిమా చేయాలన్న ఆలోచనతోనే ఇది చేస్తున్నా.