Begin typing your search above and press return to search.
స్టార్ హీరో ఫోటోని చెప్పుతో కొట్టి తగలబెట్టడం మత పిచ్చా!
By: Tupaki Desk | 19 Sep 2020 9:10 AM GMTనీట్ పరీక్షలపై స్టార్ హీరో సూర్య చేసిన కామెంట్లు సంచలనమైన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షకు హాజరైన ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యతో సౌత్ స్టార్ హీరో సూర్య తీవ్ర మనస్తాపానికి గురయి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఆయన వ్యాఖ్యలు న్యాయ వర్గాల్లో కలకలం రేపాయి. ఈ పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇచ్చినందుకు సుప్రీం కోర్టులో తప్పుగా చూపెడతావా? అంటూ కొన్ని మత సంస్థలు కూడా బరిలో దిగడం తాజాగా సంచలనమైంది.
ఓవైపు మద్రాస్ హైకోర్టు లాయర్ క్రిమినల్ ధిక్కారం అంటూ సుమోటోగా కేసును స్వీకరించాలని నివేదించారు. అయితే ఎవరు ఎన్ని గొడవలు చేసినా కోలీవుడ్ మాత్రం సూర్య వెన్నంటి నిలిచింది. స్టార్లు పరిశ్రమ వర్గాలు అండగా నిలవడం ఆసక్తికరం. #TNstandswithSuriya సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
ఇక మరోవైపు సూర్యపై ఏదో ఒక రాజకీయ వర్గమో లేక మతమౌడ్య వర్గమో దాడి చేస్తూనే ఉండడం వేడెక్కిస్తోంది. ఒక ప్రత్యేకమైన సాంప్రదాయిక మత దుస్తులు ధరించిన కొందరు వలంటీర్లు హీరో సూర్య ఫోటోలను చెప్పులతో కొట్టారు. ఈ నిరసనలో 75 మంది వాలంటీర్లు పాల్గొన్నట్లు చెబుతున్నారు. వీళ్లంతా నినాదాలు చేస్తూ సూర్య ఫోటోలను తగలబెట్టడానికి కూడా ప్రయత్నించారు.
అయితే ఈ విషయం తెలిసిన కోయంబత్తూర్ పోలీసుల సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్ధుమణిగింది. తాజా ప్రమాదకర పరిస్థితుల్లో నీట్ పరీక్షను నిర్వహించడానికి వ్యతిరేకంగా స్వరం పెంచిన సూర్య పై సాంప్రదాయ మత మౌడ్యులు ఎందుకని ఆగ్రహిస్తున్నారు? అన్నది అర్థం కావడం లేదు. కోవిడ్ భయాల మధ్య నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు నినదిస్తున్నారు. పరీక్షలకు విద్యార్థుల బౌతిక హాజరును వ్యతిరేకిస్తూ సూర్య వారికి మద్ధతునివ్వడం ఆసక్తికరం.