Begin typing your search above and press return to search.
14 ఏళ్ల తర్వాత రీల్ పైకి రియల్ జంట
By: Tupaki Desk | 5 Nov 2020 7:50 AM GMTకోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య జ్యోతికలు 2006 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లికి ముందు కలిసి నటించారు. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలకు దూరం అయ్యింది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ జ్యోతిక రీ ఎంట్రీ ఇచ్చింది. వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న జ్యోతిక త్వరలో భర్త సూర్యతో కలిసి నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అంజలి మీనన్ వీరిద్దరి కోసం ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని రెడీ చేసిందట. వారి వయసుకు తగ్గ పాత్రల్లోనే వారిద్దరిని చూపించాలని ఆమె భావిస్తుంది.
జ్యోతిక వరుసగా సినిమాలు చేస్తున్న ఈ సమయంలో భర్తతో కలిసి నటిస్తే చూడాలని అభిమానులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ జోడీకి మంచి క్రేజ్ ఉంది. కనుక వీరిద్దరిని జంటగా చూపించి సినిమా చేస్తే ఖచ్చితంగా క్రేజీ మూవీగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఇద్దరు కూడా వేరు వేరుగా సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో ఈ రియల్ లైఫ్ జంట రీల్ జంటగా మారే అవకాశం ఉంది. బెంగళూరు డేస్ సినిమాతో దర్శకురాలిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న అంజలి మీనన్ ఈ సినిమాతో మరో ఈ రియల్ జంటను చక్కని రీల్ జంటగా చూపించబోతుంది. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.