Begin typing your search above and press return to search.
సూర్య టైటిల్ అక్కడా మారిపోయింది
By: Tupaki Desk | 24 May 2015 1:30 AM GMTమన దగ్గర అంటే మాస్ అనే టైటిల్‌తో ఇంకో సినిమా ఉంది కాబట్టి.. 'రాక్షసుడు' అనే కొత్త టైటిల్ పెట్టుకున్నాడు సూర్య. కానీ తమిళంలో కూడా 'మాస్' టైటిల్ మారిపోయింది. మాస్ టైటిల్‌ను 'మాస్ ఎన్గిర మాసిలామని'గా మార్చారు తమిళంలో. మాస్ అంటే ఇంగ్లిష్ టైటిల్‌గా భావించి.. పన్ను మినహాయింపు ఇవ్వరేమో అన్న భయంతోనే ఇలా టైటిల్ మార్చినట్లు తెలుస్తోంది. తమిళంలో ఇంతకుముందు కూడా ఇదే తరహాలో టైటిళ్లు మార్చారు. బాస్ టైటిల్‌ను 'బాస్ ఎన్గిర బాస్కరన్' అని.. ఇంకా కొన్ని సినిమాల టైటిళ్లను కూడా ఇలాగే మార్చిన సందర్భాలున్నాయి.
ఈ నెల 29న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వెంకట్ ప్రభు.. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. సూర్య ఇందులో దయ్యం క్యారెక్టర్ కూడా వేశాడని పోస్టర్లను బట్టి తెలుస్తోంది. నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించగా.. హారిస్ జైరాజ్ సంగీతాన్నందించాడు. సూర్య నటించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాపవడంతో ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడతను. ఇటీవలే ప్రివ్యూ షో చూసి.. ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందని సూర్య చాలా సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. ట్రైలర్ ఉన్నంత ఆసక్తికరంగా సినిమా కూడా ఉంటే.. సూర్య ఖాతాలో చాన్నాళ్ల తర్వాత ఓ హిట్టు పడబోతున్నట్లే.