Begin typing your search above and press return to search.
సూర్య సినిమాకు ఏమైంది?
By: Tupaki Desk | 27 Nov 2015 7:30 AM GMTసూర్య స్వయంగా నిర్మాతగా మారి ఓ సినిమా తీస్తున్నాడంటే.. అందులో ఓ గెస్ట్ రోల్ కూడా చేస్తున్నాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. అందుకే పసంగ-2 మీద తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను ‘మేము’ పేరుతో తెలుగులోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరు 4న రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు కానీ.. సడెన్ గా ఏమైందో ఏమో డేటు మార్చేశారు.
డిసెంబరు 24న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందట. 4న వస్తే తెలుగులో పెద్ద పోటీ ఉండేది కాదు. శంకరాభరణం - కిల్లింగ్ వీరప్పన్ మాత్రమే వస్తున్నాయి. కానీ క్రిస్మస్ కు పెద్ద పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. కాబట్టి సూర్య సినిమాకు థియేటర్లు దొరకడమూ కష్టమే. జనాలు ఆ సినిమా మీద దృష్టిపెట్టడమూ కష్టమే.
ఐదేళ్ల కిందట వచ్చిన ‘పసంగ’ సినిమాకు ఇది సీక్వెల్. పాండిరాజ్ దర్శకుడు. పసంగ చాలా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. నేషనల్ అవార్డులు కూడా గెలుచుకుంది. దానికి సీక్వెల్ గా పాండిరాజ్ మరో మంచి కథ తయారు చేయడంతో అది నచ్చి సూర్య స్వయంగా ఈ సినిమాను నిర్మించి ఓ అరగంట కనిపించే కీలక పాత్ర చేశాడందులో. అమలాపాల్ అతడికి జోడీగా నటించింది. ఇది తారే జమీన్ పర్ తరహాలో మనసును పిండేసే పిల్లల కథ అంటున్నారు.