Begin typing your search above and press return to search.
NOC అడ్డంకులే వాయిదా కారణం.. ఎమోషన్ కి గురైన సూర్య
By: Tupaki Desk | 24 Oct 2020 4:15 AM GMTఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ జీవితంలో ఎదుర్కొన్న ఘటనలు, కష్టాలను ఆధారం చేసుకొని రూపొందిన `ఆకాశం నీ హద్దురా` (సూరారై పొట్రు) చిత్రంలో సూర్య- డాక్టర్ మోహన్ బాబు- అపర్ణా బాలమురళి ప్రధాన పాత్రధారులు. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్- శిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సూర్య- గునీత్ మోంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని పనులు పూర్తయినా రిలీజ్ ముంగిట డైలమా గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసేందుకు సూర్య వివరణను ఇచ్చారు.
రిలీజ్ క్లియరెన్స్ కి సంబంధించిన పర్మిషన్లు (NOC) రావాల్సి ఉన్నందున `ఆకాశం నీ హద్దురా` చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోందని హీరో సూర్య తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ లెటర్ పోస్ట్ చేశారు. వాస్తవానికి ఆ చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్లు ఇదివరకు ప్రకటించారు. ఆకాశం నీ హద్దురా (సూరారై పొట్రు) చిత్రం విడుదలలో జాప్యం జరగడానికి కారణాలను.. తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను హృదయాన్ని స్పృశించేలా తన లెటర్ లో ఆయన వెల్లడించారు. ఒక లెటర్ ద్వారా తన ఆలోచనలను పంచుకోవడం తన దినచర్య కాదనీ.. కానీ ఇప్పుడు తన అభిమానుల ముందు ఓపెన్ హార్ట్ తో,.. పారదర్శక మనసుతో నిలబడాల్సిన ఒక పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. ఎందుకంటే తను ఇప్పుడున్న స్థాయికి రావడంలో అన్నివేళలా తనకు అండగా నిలిచిందని అభిమానులేనని సూర్య అన్నారు.
``ఆకాశం నీ హద్దురా' (సూరారై పొట్రు) షూటింగ్ మొదలు పెట్టినప్పుడు ఇదివరకెన్నడూ షూటింగ్ జరపని లొకేషన్లలో షూటింగ్ చేయడం, భిన్న బాషలకు చెందిన, భిన్న సామర్థ్యాలున్న వ్యక్తులతో పనిచేయడం అనేవి మాత్రమే తమ ముందున్న సవాళ్లని భావించామని ఆయన తెలిపారు. అయితే వాటిని ఎగ్జిక్యూట్ చేయడం చాలా పెద్ద విషయం అని ఈజీగా చెప్పవచ్చ``ని సూర్య అన్నారు.
ఆకాశం నీ హద్దురా (సూరారై పొట్రు) చిత్రం వైమానిక రంగం నేపథ్యంలో నడిచే కథ అని అందరికీ తెలిసిందేననీ కాబట్టి తాము అనేక పద్ధతులు పాటించాల్సి వచ్చిందనీ, పర్మిషన్లు తీసుకోవాల్సి వచ్చిందనీ సూర్య చెప్పారు. ``ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారం. మేం నిజమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలు,... సెక్యూరిటీతో డీల్ చేయాల్సి వచ్చింది. కొన్ని ఎన్.వోసీలు (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు) అనుమతుల కోసం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిరీక్షణ అనివార్యమని మేం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న మహమ్మారి కాలంలో మిగతా అన్ని విషయాల కంటే దేశం.., దాని ప్రాధాన్యాల మీదే అధిక దృష్టి పెట్టాల్సి వస్తోంది`` అని ఆయన తెలిపారు. ఈ జాప్యాన్ని నా శ్రేయోభిలాషులు ప్రేమ నమ్మకంతో అర్థం చేసుకుంటారని వ్యక్తిగతంగా నేను ఆశిస్తున్నాను అని సూర్య తెలిపారు. అన్ని అనుమతులూ అభించి విడుదలకు సిద్ధమయ్యాక ఆ విషయాన్ని తెలియజేస్తామనీ, ఈలోగా ట్రైలర్, మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తామని ఆయన వెల్లడించారు.