Begin typing your search above and press return to search.

ఆ టైటిలే ఎందుకని గంట ఆలోచించాడట

By:  Tupaki Desk   |   12 April 2016 4:09 AM GMT
ఆ టైటిలే ఎందుకని గంట ఆలోచించాడట
X
మూస సినిమాలు - మాసు సినిమాలే కాక తెలుగు భాషలోనూ అద్భుతమైన కధాకధనాలతో మంచి చిత్రాలు తెరకెక్కించగలమని ఇటీవల కాలంలో మనం చిత్రం రుజువుచేసింది. ఈ సినిమా కధ వినడానికి క్లిష్టంగా వున్నా దాన్ని దర్శకుడు విక్రం కుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతం. విక్రమ్ పై ఆ నమ్మకంతోనే ఇప్పుడు సూర్య - రెహమాన్ - సమంతా వంటి భారీ పేర్లతో '24' సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్ర ఆడియో విడుదల నిన్న హైదరాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ "విక్రమ్ కధ నాలుగున్నర గంటలు చెప్పారని, విన్నంత సేపూ కళ్ళు కూడా ఆర్పలేదని, అయిపోగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టానని చెప్పాడు". గజిని సినిమా చూసాక సూర్య లాంటి నటుడితో ఒక్క సినిమా అన్నా చెయ్యాలన్న తన కోరిక ఇప్పటికి తీరినట్టు విక్రమ్ తెలిపాడు.

నా మొదటి సినిమానే చిరస్మరణీయంగా మరల్చడంతో రెహమాన్ సార్ పాత్ర ఎంతో వుందని, మరోసారి ఆయన మా సినిమాకు చెయ్యడం ఆనందమని సమంతా తెలిపింది. ఇక సూర్య తమ్ముడు కార్తీ ఈ సినిమా కధ - టైటిల్ విన్నాక వీటి మధ్య కనెక్షన్ అర్ధమవడానికి నాకు గంట సమయం పట్టిందని, ఈ చిత్రానికిదే అద్భుతమైన టైటిల్ అని చెప్పుకొచ్చాడు.