Begin typing your search above and press return to search.
తెలుగు మీడియా పిచ్చోళ్ళా సూర్య??
By: Tupaki Desk | 18 May 2016 3:30 PM GMTనిజానికి తమిళనాట కంటే.. తెలుగులోనే ''24'' సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారనే విషయం.. ఒక్కసారి కలక్షన్లను చూస్తే తెలుస్తుంది. అసలు ఇక్కడ క్రిటిక్స్.. సినిమానూ సూర్యను ఆకాశానికి ఎత్తేశారు. అయితే సినిమాను ప్రమోట్ చేసుకునే టైములో.. అసలు ఇక్కడి క్రిటిక్స్ ఎవ్వరూ మన సూర్య అండ్ కో వారికి మినిమం సైజులో కూడా కనిపించినట్లులేరేమో. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అందరూ ఇదే ఫీలవుతున్నారు.
తెలుగు అండ్ తమిళంలో సినిమా సూపర్ హిట్ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు అందులో మొత్తంగా తమిళ మీడియా సంస్థల పేర్లు.. తమిళ రివ్యూ రైటర్ల పేర్లు.. అసలు మనకు ఇక్కడ తెలియని కొన్ని వెబ్ సైట్ల పేర్లనూ వేసి.. వారిచ్చిన రేటింగులు ఎన్ని స్టార్లో తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ గోడలమీద ఈ పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. తెలుగు మీడియా అన్నా.. ఇక్కడ క్రిటిక్స్ అన్నా ఎంత లెక్క లేకుండా.. చాలా దారుణంగా ట్రీట్ మెంట్ ఇస్తున్నారో ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుందిగా.
ర్యాంకింగ్ లో ఇండియానే షేక్ చేస్తున్న తెలుగు వెబ్ సైట్లు.. ఇక్కడి పత్రికలూ.. ఇతర పేరొందిన క్రిటిక్స్.. వారి పేర్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రింట్ చేయకపోవడాన్ని మనం ఏమనాలి? ఏమ్మా సూర్య.. ఇక్కడి మీడియాను మాంచి మసిపూసి మారేడుకాయను చేశావ్ గా. సినిమా రిలీజయ్యే వరకు ప్రమోషన్లు.. బాగా హైప్ వచ్చాక.. ఇదిగో ఇలా మినిమం రికగ్నిషన్ కూడా ఇవ్వరు. గుడ్ జాబ్.