Begin typing your search above and press return to search.
మోహన్ బాబు ఒక లెజెండ్ అంటున్న తమిళ స్టార్
By: Tupaki Desk | 17 Jun 2019 4:52 AM GMTతమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో 'సూరరై పోట్రు' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ విమాన సంస్థను స్థాపించిన జీ ఆర్ గోపీనాథ్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వెటరన్ యాక్టర్ మోహన్ బాబు ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా మోహన్ బాబు చాలా తక్కువ చిత్రాల్లో నటించారు. మోహన్ బాబు చివరిగా 'గాయత్రి'.. 'మహానటి' చిత్రాల్లో నటించారు. ఇలాంటి సమయంలో మోహన్ బాబు ఒక తమిళ స్టార్ హీరో చిత్రంలో నటించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
రీసెంట్ గానే మోహన్ బాబు 'సూరరై పోట్రు' టీమ్ తో జాయిన్ అయ్యారు. ఈ విషయంపై సూర్య ట్విట్టర్ ద్వారా స్పందించారు. "మోహన్ బాబు సర్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. లైవ్లీ గా ఉండడమే కాదు.. గొప్ప క్రమశిక్షణ కలిగిన లెజెండ్ ఆయన. గ్యారేజ్ లో ఉన్న దశ నుండి 500 సినిమాలకు పైగా నటించిన ఆయన ప్రయాణం స్ఫూర్తినిచ్చేది. ఇదో అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. #సూరరై పొట్రు లో భాగం అయినందుకు థ్యాంక్ యూ సర్." అంటూ ట్వీట్ చేశారు.
'గురు' లాంటి విభిన్న చిత్రం రూపొందించిన సుధా కొంగర రూపొందిస్తున్న నెక్స్ట్ ఫిలిం కావడం.. సూర్య-మోహన్ బాబు కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి కానీ సూర్య ఈమధ్య నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద వరసగా నిరాశ పరుస్తున్నాయి. మరి ఈ సినిమా అయినా హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మోహన్ బాబుకు కోలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు వస్తాయేమో.