Begin typing your search above and press return to search.
తక్కువ స్థాయి విమర్శకులను పట్టించుకోవద్దు: స్టార్ హీరో
By: Tupaki Desk | 13 Aug 2020 3:45 AM GMTచెన్నైకి చెందిన సూపర్ మోడల్, యాక్ట్రెస్ మీరా మిథున్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో చర్చలకు తెరలేపుతుంది. సూర్య హీరోగా నటించిన గ్యాంగ్, 8 తొత్తకల్ మూవీస్ లలో మెరిసింది. ఈ యంగ్ బ్యూటీ.. సీనియర్ హీరోయిన్ త్రిష తన కెరీర్ పాడుచేస్తుందని ఇటీవలే సంచలన ఆరోపణలు చేసింది. తనను సైడ్ చేయడం వలనే త్రిష టాప్ స్థాయిలోకి ఎదిగిందని ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేసింది. అంతేగాక త్రిషకి కులమతాలకు ప్రాధాన్యత ఇస్తుందని.. తనలాంటి ఎంతో మంది నటులను అణగదొక్కడానికి త్రిష పలుమార్లు తన ఉన్నత కుల ప్రస్తావన కూడా తీసిందని ఆరోపించింది. ఆ విధంగానే ఎన్నై ఇరిందాల్, రజినీకాంత్ పేట సినిమాలలో తన పాత్రలు కట్ అవ్వడానికి త్రిషనే కారణమని మీరా సంచలన వ్యాఖ్యలు చేయడమే గాక చట్టపరమైం చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో మీరా వ్యాఖ్యలు చర్చలకు దారితీస్తున్నాయి. ఇక ఇండస్ట్రీలో బంధుప్రీతి పై కూడా ఆరోపించింది. అందులో భాగంగానే స్టార్ హీరోలు విజయ్, సూర్యలు ఇండస్ట్రీలోకి వచ్చారని, వేరే వాళ్లను రాకుండా వారే స్టార్స్ అవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారని ఆరోపించింది. మీరా ఆరోపణల పై నెటిజన్లు మాత్రం ఓ రేంజిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతేగాక ఈ హీరోల పై ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసుకోవడం లేదంటూ.. చేతులకు గాజులు తొడుక్కోండి, చీరలు పంపిస్తా కట్టుకోండని దారుణంగా ఆరోపించింది. ఈ క్రమంలో మీరా మిథున్ అనుచిత వ్యాఖ్యల పై కోలీవుడ్ నోరువిప్పింది. నటి కస్తూరి, డైరెక్టర్ భారతీరాజా లాంటి సెలబ్రిటీలు మీరా పై ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీలో టాలెంటుకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని.. బంధుప్రీతి (నేపోటిజం) లేదని.. అంతేగాక సొంత ప్రతిభతోనే స్టార్స్ అవుతారని చెప్పింది నటి కస్తూరి. ఇక మీరా ఆగడాల పై స్పందించిన సూర్య.. గతంలో ఎప్పుడో చేసిన పోస్ట్‌ను మళ్లీ తీసి సెటైర్ వేశాడు. "తక్కువ స్థాయి విమర్శలకు మనం స్పందించి మన స్థాయిని తగ్గించుకోవద్దు. మీ విలువైన సమయాన్ని మంచి పనులకు వాడండి. సమాజ శ్రేయస్సుకోసం పాటు పడండి" అని పాత పోస్ట్ తో సమాధానం చెప్పాడు. అలాగే.. "గొప్ప కార్యక్రమాలకు మీ తెలివిని, సమయాన్ని వాడాలని నా సోదర సోదరిమణులను కోరుతున్నా.. అంటూనే డైరెక్టర్స్ తిరు, భారతీరాజాలకు ధన్యవాదాలు తెలిపాడు సూర్య. హీరో స్పందన చూసి మీరాకి స్ట్రాంగ్ పంచ్ పడిందని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.