Begin typing your search above and press return to search.
సూర్య వర్సెస్ మెగా హీరో.. తప్పదేమో
By: Tupaki Desk | 20 Sep 2016 5:11 AM GMTకోలీవుడ్ హీరో సూర్యకు అక్కడి మార్కెట్ తో సమానంగా టాలీవుడ్ లోనూ క్రేజ్ ఉంది. సూర్య నటించిన ప్రతీ సినిమా.. ఇక్కడ స్టార్ హీరోలతో సమామైన రేంజ్ లో విడుదల అవుతూ ఉంటుంది. మొన్న సమ్మర్ లో వచ్చిన 24 అయితే.. కోలీవుడ్ లో కంటే ఇక్కడే పెద్ద హిట్ అయింది. అంత క్రేజ్ ఉన్న సూర్య.. సింగం సిరీస్ లో మూడో భాగం ఎస్3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినట్లు ఆల్రెడీ చెప్పుకున్నాం.
ఎస్3 చిత్రం డిసెంబర్ 16న విడుదల చేయనున్నట్లు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసేశారు. నిజానికి దీపావళి కానుకగా అక్టోబర్ చివరకే రావాల్సి ఉంది కానీ.. తమ్ముడి కోసం ఆ పండుగను త్యాగం చేసి క్రిస్మస్ ని టార్గెట్ చేశాడు సూర్య. అయితే.. లేటెస్ట్ గా అనౌన్స్ ఈ డేట్ కారణంగా.. టాలీవుడ్ లో మరో పెద్ద సినిమాతో క్లాష్ వస్తోంది. రామ్ చరణ్ నటిస్తున్న 'ధృవ' రిలీజ్.. దసరా నుంచి డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను డిసెంబర్ 16న లేదా 17న విడుదల చేయాలన్నది గీతా ఆర్ట్స్ ఆలోచన. సాధారణంగా సూర్య సినిమాలను ఈ సంస్థే విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మేనల్లుడు చెర్రీతో తానే నిర్మించిన ధృవ కోసమే అల్లు అరవింద్ మొగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ డేట్ కి రావడం ద్వారా ఇక్కడ ధృవ ఎఫెక్ట్ గట్టిగానే పడే ఛాన్స్ ఉంది.
అయితే పొరపాటును ఈ 'యముడు' గట్టిగా క్లిక్ అయి చరణ్ వీకైతే మాత్రం.. ఆ ప్రభావం ధృవ రిజల్టుపై కూడా పడుతుంది. ఎందుకంటే సూర్యను మరీ తక్కువంచనా వేయలేం. అలాగే చరణ్ గట్టిగా కొడితే సూర్యకు ఇబ్బందే. చూద్దాం ఈ సూర్య వర్సెస్ మెగా హీరో క్లాష్ లో ఏమవుతుందో!!