Begin typing your search above and press return to search.

తమ్ముడినే పండగ చేస్కోమంటున్న సూర్య

By:  Tupaki Desk   |   15 Sep 2016 7:30 AM GMT
తమ్ముడినే పండగ చేస్కోమంటున్న సూర్య
X
టాలీవుడ్ లో దసరా పండక్కి ఎంత హంగామా ఉంటుందో.. కోలీవుడ్ లో దీపావళికి అదే రేంజ్ లో సినిమాల సందడి ఉంటుంది. స్టార్ హీరోలందరూ దీపావళికి సత్తా చాటేందుకు తెగ ట్రై చేసేస్తూ ఉంటారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఈ దీవాలికి సింగం సీక్వెల్ ఎస్3 రిలీజ్ చేస్తామని గతంలోనే చెప్పాడు. ఇందుకు అనుగుణంగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాడు.

అనుష్క-శృతి హాసన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న సింగం3.. సెప్టెంబర్ చివరినాటికి షూటింగ్ పూర్తయిపోనుంది. అంటే అక్టోబర్ 30నాటికి దీపావళి విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఇప్పుడీ సినిమాను క్రిస్మస్ కు వాయిదా వేసేసుకున్నాడట సూర్య. ఇందుకు కారణం తమ్ముడు కార్తీనే అని తెలుస్తోంది. కార్తీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన కాష్మోరాలో నయనతార- శ్రీవిద్యలు హీరోయిన్స్ గా నటించగా.. ఈ చిత్రాన్ని దీవాళికి రిలీజ్ చేసేందుకు దర్శకుడు గోకుల్ ప్రయత్నిస్తున్నాడు.

ఈ విషయం తెలిసిన సూర్య.. దీపావళి పండుగ తమ్ముడినే చేస్కోమని చెప్పి తాను తప్పుకున్నాడు. సింగం సీక్వెల్ రిలీజ్ విషయంలో సూర్య నుంచి క్లారిటీ వచ్చేయడంతో.. అన్నాదమ్ముల మధ్య దీపావళి పోటీ లేనట్లే అని తేలిపోయింది.