Begin typing your search above and press return to search.
స్టార్ హీరో దీపావళి సెంటిమెంట్ పునరావృతం అయ్యేనా?
By: Tupaki Desk | 6 Nov 2020 4:45 AM GMTతమిళ స్టార్ హీరో సూర్య వచ్చే వారం సూరారైపోట్రూ తో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో తెలుగు లో డబ్ అవుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక సామాన్యమైన పైలెట్ ఒక విమానయాన సంస్థను ప్రారంభించిన తీరు సామాన్యులకు విమాన ప్రయాణంను తక్కువ ఖర్చుతో చేయించిన విధానంను చూపించారు. ఈ సినిమాపై తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంది. మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇక ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను సూర్య అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సూర్య ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో దీపావళికి వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దీపావళి అంటే సూర్యకు లక్కీగా మారింది. అందుకే ఈ సినిమాతో మరోసారి సూర్య దీపావళి సెంటిమెంట్ ను పునరావృతం చేస్తాడంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
శివపుత్రుడు.. సెవన్త్ సెన్స్.. ఘటికుడు.. దేవ.. నంద సినిమాలు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు అన్ని కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నవే. కనుక ఈసారి సూరారైపోట్రూ సినిమాతో దీపావళికి ఆరవ విజయాన్ని తన ఖాతాలో సూర్య వేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈసారి థియేటర్ లో కాకుండా ఓటీటీ ద్వారా విడుదల అవుతుండటం అభిమానులకు కాస్త నిరుత్సాహంను కలిగిస్తుంది. ఓటీటీ అయినా సూర్య దీపావళి సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ అయ్యేనా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.