Begin typing your search above and press return to search.
సూర్య తప్పు చేశాడనిపిస్తుంది
By: Tupaki Desk | 12 Nov 2020 7:10 AM GMTతమిళ స్టార్ హీరో తాజాగా సూరారై పోట్రూ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈమద్య కాలంలో సూర్యకు సాలిడ్ హిట్ పడిందే లేదు. ఈ సినిమా ఫలితం కూడా ఎలా ఉంటుందో అనుమానంతో ఇలా ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దం అయ్యారా అంటూ కామెంట్స్ వినిపించాయి. కాని థియేటర్లు ఎప్పటి వరకు ఓపెన్ అయ్యేది క్లారిటీ లేదు. కనుక నిర్మాణం పరంగా చాలా భారం పడుతుందనే ఉద్దేశ్యంతో సినిమాను డైరెక్ట్ రిలీజ్ కు సూర్య ఇచ్చేశాడు. ఇప్పుడు అదే ఆయన అభిమానులకు కోపం తెప్పిస్తుంది.
తమిళంతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సూర్య అభిమానులు అయితే సినిమా సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతో సూర్యకు సాలిడ్ హిట్ అయితే దక్కింది కాని అది ఓటీటీ మూవీ అవ్వడం వల్ల కాస్త నిరుత్సాహంగా అనిపిస్తుంది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్లు వెయిట్ చేసిన సూర్య మరో రెండు నెలల వరకు వెయిట్ చేసి సంక్రాంతి సీజన్ కు లేదా ఫిబ్రవరిలో థియేటర్లలో నే విడుదల చేస్తే బాగుండేది కదా అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి సినిమాను ఓటీటీలో విడుదల చేసి తప్పు చేశావు సూర్య అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు దర్శకురాలు సుధ కొంగర రూపొందించిన ఈ సినిమాను సూర్య స్వయంగా నిర్మించిన విషయం తెల్సిందే.