Begin typing your search above and press return to search.

కొత్త పోస్ట‌ర్‌: ఆకాశం నీ హ‌ద్దురా!

By:  Tupaki Desk   |   1 Jan 2020 3:30 PM GMT
కొత్త పోస్ట‌ర్‌: ఆకాశం నీ హ‌ద్దురా!
X
త‌మిళ స్టార్ హీరో సూర్య కెరీర్ గ‌త కొంత‌కాలంగా ట్రాక్ త‌ప్పిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిసారీ తాను ఒక‌టి ఆశిస్తే ఫ‌లితం ఇంకోలా వ‌స్తోంది. ఇటీవ‌లే రిలీజైన బందోబ‌స్త్ తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఆ క్ర‌మంలోనే అత‌డు ఆచితూచి క‌థ‌ల్ని ఎంచుకుంటూ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో `సూరారై పొట్రు` అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో `ఆకాశం నీ హద్దురా` పేరుతో అనువాద‌మ‌వుతోంది. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

తాజాగా నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర‌బృందం మ‌రో కొత్త‌ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్ లో సూర్య ఎంతో సీరియ‌స్ గానే క‌నిపిస్తున్నాడు. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఆకాశంలో స్వేచ్ఛ‌గా విహ‌రించే ప‌క్షిని పోస్ట‌ర్ లో ముద్రించారు. గురు చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సుధ కొంగ‌ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడు మ‌రో ఆసక్తికరమైన పాయింట్ ని ద‌ర్శ‌కురాలు సూర్య సినిమాకి కథగా ఎంచుకున్నట్లు టాక్. సూర్య ఎంతో వైవిధ్య‌మైన‌ రోల్ లో నటిస్తున్నాడు. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఈనెల 7న రిలీజ్ చేయ‌నున్నారు. సూర్య సొంత బ్యానర్‌ 2డి ఎంటర్ టైన్ మెంట్స్ లో రూపొందిస్తున్న‌ ఆర‌వ చిత్ర‌మిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి లో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనికిత్ బొమిరెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ఈ సినిమాలో కాళీ వెంకట్- కారుణాస్- ప్రతాప్ పోతన్- పరేశ్ రావల్- వివేక్ ప్రసన్న- కృష్ణ కుమారి తదితరులు నటిస్తున్నారు.