Begin typing your search above and press return to search.
ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ న్యూస్!
By: Tupaki Desk | 28 July 2022 12:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నవిషయం తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో `సలార్` యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో `ప్రాజెక్ట్ కె` మూవీలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో వున్నాయి. ఇందులో `ప్రాజెక్ట్ కె`ని సైన్స్ ఫిక్షన్ గా భారీ స్థాయిలో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకోన్, దిషా పటానీ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న విషయం తెలిసిందే. `ఆదిత్య 369` వంటి విజువల్ వండర్ ని తెరకెక్కించి సంచలనం సృష్టించిన సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్ కు మెంటర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవలే కీలక ఘట్టాల చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ని నిర్మాత సి. అశ్వనీదత్ తాజాగా గురువారం వెల్లడించారు.
ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ లాంటి వార్తే. ప్రాజెక్ట్ కె అవుట్ పుట్ అందరిని ఆశ్చర్యపరుస్తుందన్నారు. హాలీవుడ్ మూవీ `అవెంజర్స్` స్థాయి ప్రాజెక్ట్ ఇదని, చైనా, అమెరికా వంటి ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్ లని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ చేయని పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని స్పష్టం చేశారు. అందరికంటే మించి హీరో ప్రభాస్ అద్బుతంగా నటించారని చెప్పుకొచ్చారు.
ఈ `ప్రాజెక్ట్ కె` ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళతుందని, సెట్ లోకి అడుగుపెట్టడానికి ప్రభాస్, దీపిక పదుకోన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. డిసెంబర్ నాటికి షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని అయితే గ్రాఫిక్స్ కోసం మాత్రం తొమ్మిది నెలలు కేటాయించబోతున్నామని తెలిపారు. ఈ సినిమాతో అమెరికా, చైనా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాం. 2024 అక్టోబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు అత్యంత భారీ స్థాయిలో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం` అన్నారు.
నిర్మాత అశ్వనీదత్ వెల్లడించిన తాజా విశేషాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ ఎప్పుడో కూడా తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ట్విట్టర్ లో ఈ వార్తని తెగ వైరల్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన `రాధేశ్యామ్` దారుణ ఫలితాన్ని అందించడంతో కొంత నిరుత్సాహానికి గురైన అభిమానులు `ప్రాజెక్ట్ కె` పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.