Begin typing your search above and press return to search.
మెగాహీరోలను మెగాహిట్లతో చుట్టబెట్టేస్తున్నాడే!
By: Tupaki Desk | 26 Feb 2021 2:30 AM GMTతెలుగులో వీవీ వినాయక్ తరువాత ఆ స్థాయిలో అటు యూత్ ను .. ఇటు మాస్ ఆడియన్స్ ను మెప్పించే దర్శకుడిగా హరీశ్ శంకర్ కనిపిస్తాడు. లవ్ .. యాక్షన్ .. కామెడీలను కలుపుకుని ఆయన సినిమాలన్నీ పూర్తి వినోదభరితంగా తెరకెక్కుతుంటాయి. కథ మొదలైన దగ్గర నుంచి శుభం కార్డు పడేవరకూ తెరపై ఆయన చేయించే సందడి అంతా ఇంతా కాదు. రాజమౌళి .. కొరటాల .. అనిల్ రావిపూడి వంటివారికి అపజయం ఎరుగని దర్శకులుగా పేరుంది. ఇక హరీశ్ శంకర్ కూడా, మెగా హీరోలతో చేసిన సినిమాలు ఫ్లాప్ కావనే పేరు తెచ్చుకున్నాడు.
మెగా కాంపౌండులో అడుగుపెట్టిన ఆయన ముందుగా పవన్ కల్యాణ్ తో 'గబ్బర్ సింగ్' సినిమా చేశాడు. ఈ సినిమా పవన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆయన కెరియర్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తరువాత సాయిధరమ్ తేజ్ హీరోగా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాను చేశాడు. ఈ సినిమా యూత్ .. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. సాయిధరమ్ తేజ్ కి కెరియర్ పరంగా మాంఛి ఉత్సాహాన్ని.. ఊపును ఇచ్చింది. ఇక ఆ తరువాత బన్నీ హీరోగా ఆయన చేసిన 'దువ్వాడ జగన్నాథం' .. సక్సెస్ కి సరైన అర్థం చెప్పింది.
యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో బన్నీ చేసిన సినిమాల్లో 'దువ్వాడ జగన్నాథం' సినిమాకి ఫస్టుమార్కు పడిపోతుంది. బన్నీ లోని కొత్త యాంగిల్ ను పరిచయం చేసిన డైరెక్టర్ గా హరీశ్ మంచి పేరు కొట్టేశాడు. ఈ సినిమా నుంచే పూజా హెగ్డే దశతిరిగిపోయింది. ఈ సినిమా తరువాత హరీశ్ చేసిన 'గద్దలకొండ గణేశ్' .. వరుణ్ తేజ్ కి మంచి హిట్ ను అప్పగించింది. ఇలా మెగా హీరోలతో హరీశ్ శంకర్ ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్టే అవుతూ వచ్చింది. వరుసగా మెగా హీరోలతో హ్యాట్రిక్ హిట్టు అందుకున్న ఆయన, తదుపరి సినిమాను పవన్ తో చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాతో, ఆయన ఖాతాలోకి మరో హిట్టు చేరిపోవడం ఖాయమేననేది మెగా అభిమానుల మాట.