Begin typing your search above and press return to search.

న్యూడ్ గా నటించినా నా భర్తకు ఓకే

By:  Tupaki Desk   |   18 April 2018 7:07 AM GMT
న్యూడ్ గా నటించినా నా భర్తకు ఓకే
X
పెళ్లయ్యాక సినిమాలు చేయడం.. హీరోయిన్ల విషయంలో ఇదో మహాద్భుతంలా ఫీల్ అవాల్సిన పరిస్థితి. పెళ్లయినా సరే హీరో ఎలాంటి సినిమాలైనా చేయచ్చు.. ఎలాంటి సన్నివేశాల్లో అయినా నటించొచ్చు. కానీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ మాత్రం.. ఇలా నటించడానికి ఓకేనా.. అలా యాక్ట్ చేస్తారా లాంటి క్వశ్చన్స్ వస్తాయి.

రీసెంట్ గా రంగస్థలం మూవీలో రామ్ చరణ్ కు సమంత లిప్ కిస్ ఇస్తే ఎంతగా చర్చనీయాంశం అయిందో చూశాం. ఇప్పుడు ఓ హీరోయిన్ అయితే.. తాను సినిమాల్లో నగ్నంగా నటించినా తన భర్తకు అభ్యంతరం లేదని చెప్పడం నిజంగా సెన్సేషన్ అనాల్సిందే. తెలుగులో రాజు మహరాజు అంటూ ఓ చిన్న సినిమాలో కనిపించిన ఈ సుందరి.. తమిళ్.. హిందీల్లో కెరీర్ బాగానే లాక్కొస్తోంది. కొంత కాలం క్రితం అక్షయ్ టక్కర్ ను వివాహమాడింది సుర్వీన్ చావ్లా. ఇప్పటికీ మూవీస్ చేస్తున్న ఈమె.. ఇకపై కూడా ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.

'నేను నా సహ నటుడితో ముద్దు సన్నివేశాలలో నటింస్తాను.. హగ్ చేసుకుంటాను.. చివరకు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా అయినా ఏం చేస్తాను. స్క్రిప్ట్ కోసం ఏదైనా చేస్తాను. ఇందులో నా భర్తకు ఎలాంటి అభ్యంతరాలు లేవు' అని స్టేట్మెంట్ ఇచ్చిన సుర్వీన్ చావ్లా.. తన భర్తతో తనకు కంఫర్ట్ లెవెల్స్ ఆ స్థాయిలో ఉంటాయని.. ఏ మహిళకు అయినా అంతకు మించి ఏం కావాలని అంటోంది.