Begin typing your search above and press return to search.
జాతీయ అవార్డు విన్నరైన దర్శకుడు బట్టలు విప్పమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 21 Dec 2021 2:30 AM GMTఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఎప్పటి నుండే ప్రచారం జరుగుతోంది. ప్రతి ఒక్క చోట కూడా ఈ చెత్త వ్యవహారం ఉంది కాని ఇండస్ట్రీలో మాత్రం ఎక్కువగా ఉంది అనేది వాదన. అవకాశాల కోసం ప్రొడక్షన్ మేనేజర్స్ నుండి దర్శక నిర్మాతల వరకు కమిట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని.. వారు అంతా కూడా కొత్త వారు అంటే అసభ్యంగా ప్రవర్తిస్తారు అంటూ గతంలో పలువురు హీరోయిన్స్.. ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. కొందరు కాస్టింగ్ కౌచ్ కు బలి అవుతుంటే.. కొందరు మాత్రం అవకాశం లేకున్నా పర్వాలేదు.. ఇండస్ట్రీలో ఆఫర్లు రాకున్న పర్వాలేదు అన్నట్లుగా అలాంటి వారికి దూరంగా జరుగుతున్నారు. కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తాజాగా మరో హీరోయిన్ వెళ్లడించేందుకు మీడియా ముందుకు వచ్చింది.
బాలీవుడ్ కు చెందిన సుర్వీన్ చావ్లా తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ ను గురించి చెప్పుకొచ్చింది. సౌత్ లో ఒక జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రముఖ దర్శకుడు తన సినిమాలో అవకాశం ఇస్తానంటూ రమన్నాడు. ఆయనతో లొకేషన్స్ ను చూసేందుకు రమ్మన్నాడు. వెళ్లిన సమయంలో నీ బాడీలోని ప్రతి పార్ట్ గురించి నాకు తెలియాలి. కనుక డ్రస్ విప్పి అలా నిల్చో అన్నాడు. దాంతో నేను వెంటనే అక్కడ నుండి వచ్చేశాను. ఆయన తీరు... ఆయన ఉద్దేశ్యం నాకు అర్థం అయ్యి అక్కడ మళ్లీ ఎప్పుడు వెళ్లలేదు. కాని అతడు మాత్రం నాకు చాలా సార్లు కాల్ చేశాడు. ఎప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు. అతడు మాత్రమే కాకుండా అలాంటి వాళ్లు నా కెరీర్ లో చాలా మంది ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
కెరీర్ ఆరంభించిన సమయంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కొందరు తన పట్ల వ్యవహరించిన తీరుతో చాలా బాధ కలిగేది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జాతీయ అవార్డును దక్కించుకున్న దర్శకుడు ఒక మహిళతో అలా ప్రవర్తించడం అంటే సిగ్గు చేటు అంటూ కొందరు విస్తు పోతున్నారు. మీటూ ఉద్యమం మొదలు అయిన తర్వాత కొందరు ఇలాంటి పబ్లిసిటీ కోరుకుంటున్నారు. ఉన్నా లేకున్నా అలాంటి వ్యాఖ్యలు చేసి మీడియాలో నిలవాలని భావిస్తున్నారు. కనుక ఈమెది ఎలాంటి వ్యవహారం అనేది తెలియాలంటూ కొందరు ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తుంటే ఎక్కువ శాతం మంది మాత్రం ఆమెను సమర్థిస్తూ.. మీ జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనలు మరెవ్వరికి రాకుండా ఉండాలాని కోరుకుందాం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.