Begin typing your search above and press return to search.

కత్తి పట్టుకొని బయలుదేరిన సూర్య..!

By:  Tupaki Desk   |   9 April 2021 8:13 AM GMT
కత్తి పట్టుకొని బయలుదేరిన సూర్య..!
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 40వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇదొక సామాజిక అంశాలతో రూపొందే మాస్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న హీరో సూర్య కూడా సెట్స్ లో అడుగుపెట్టినట్లు ఈ మధ్య మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా 'సూర్య40' సెట్స్ లో ఆయనకు సంబంధించిన ఓ ఫోటోని చిత్ర బృందం సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేశారు.

సూర్య ఈ ఫొటోలో పెద్ద కత్తి పట్టుకొని బయలుదేరాడు. పంచె కట్టులో బ్యాక్ సైడ్ వ్యూలో కనిపిస్తున్న సూర్య అభిమానులను అలరిస్తున్నాడు. ఇది ఫైట్ సీన్ కు సంబంధించిన స్టిల్ అని అర్థం అవుతోంది. కాగా, 'సూర్య40' సినిమాలో స‌త్య‌రాజ్‌ - జయప్రకాశ్ - శరణ్య పొన్వన్నన్ - సుబ్బు పంచు - దేవదర్శిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జాకీ ఆర్ట్ డైరెక్టర్‌ గా పని చేస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ అన్బు-అరివ్ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇంతకముందు సూర్య - పాండిరాజ్‌ కాంబినేషన్‌ లో ‘పసంగ 2’(మేము) సినిమా వచ్చింది. ఇప్పుడు అదే కాంబోలో వస్తున్న 'సూర్య40' పై మంచి అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ లో సూర్య కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.